AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫేక్‌ న్యూస్‌ స్ప్రెడ్‌ చేయకండి..! భారత్‌-పాక్‌ దాడులపై రోహిత్‌ శర్మ రియాక్షన్‌

భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నకిలీ వీడియోలపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆందోళన వ్యక్తం చేశాడు. భారత సైన్యం ధైర్యాన్ని ప్రశంసిస్తూ, నకిలీ వార్తలను నమ్మకూడదని, బాధ్యతాయుతంగా ఉండాలని కోరాడు. దేశ రక్షణలో సైన్యం పాత్రను కొనియాడారు.

ఫేక్‌ న్యూస్‌ స్ప్రెడ్‌ చేయకండి..! భారత్‌-పాక్‌ దాడులపై రోహిత్‌ శర్మ రియాక్షన్‌
Rohit Sharma
SN Pasha
|

Updated on: May 09, 2025 | 1:15 PM

Share

భారత్‌ పాకిస్థాన్‌ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్ని విషయం తెలిసిందే. ఒక రకంగా రెండు దేశాల మధ్య అనధికారిక యుద్ధం మొదలైందని నిపుణులు అంటున్నారు. పహల్గామ్‌ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌, పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ పేరిట దాడులు చేపట్టింది. దీనికి ప్రతీకారంగా పాకిస్థాన్‌ జమ్మూ కశ్మీర్‌తో పాటు పలు ప్రాంతాలపై దాడికి యత్నించింది. కానీ, వాటిని భారత్‌ తప్పికొట్టింది. ఆ తర్వాత భారత్‌ పాక్‌పై దాడి చేసినట్లు ఇప్పటి వరకు సమాచారం అందుతోంది. ఈ క్రమంలోనే సోషల్‌ మీడియాలో పలు వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. వాటిలో 90 శాతం ఫేక్‌ వీడియోలు, ఏఐ జనరేటెడ్‌ వీడియోలు అంటూ కొంతమంది ఫ్యాక్ట్‌ చేసి నిరూపిస్తున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా వన్డే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్పందించాడు. ఫేక్‌ వీడియోలతో పాటు, పాకిస్థాన్‌ దాడులను తిప్పికొడుతూ, పాక్‌పై దాడి చేస్తున్న సాయుధ దళాల గురించి కూడా రోహిత్‌ ఎక్స్‌ వేదికగా స్పందించాడు. “గడిచే ప్రతి క్షణం, తీసుకునే ప్రతి నిర్ణయంతో నేను మన భారత సైన్యం, భారత వైమానిక దళం, భారత నావికాదళం పట్ల చాలా గర్వంగా ఉన్నాను. మన యోధులు మన దేశ గౌరవానికి అండగా నిలుస్తున్నారు. ప్రతి భారతీయుడు బాధ్యతాయుతంగా ఉండటం, నకిలీ వార్తలను వ్యాప్తి చేయకుండా లేదా నమ్మకుండా ఉండటం ముఖ్యం. అందరూ సురక్షితంగా ఉండండి!” అంటూ ట్వీట్‌ చేశాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్