దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు,మరణాల్లో రోజూ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 17,20,100 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 29,689 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 3,98,100కి చేరింది. ఇందులో 3,06,21,469 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న కొత్తగా 42,363 మంది దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ కావడంతో.. రికవరీల సంఖ్య 3,06,21,469కి చేరింది.
అటు నిన్న 415 మంది కరోనాతో మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 4,21,382 చేరుకుంది. ఇదిలా ఉంటే ఇప్పటిదాకా 44,19,12,395 కోట్ల వ్యాక్సినేషన్ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. కాగా, దేశంలో క్రియాశీల రేటు 1.31 శాతానికి చేరిందని.. అలాగే రికవరీ రేటు 97.35 శాతంలో ఉందని పేర్కొంది.