AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రగులుతోంది సరిహద్దు.. కమ్ముకున్న యుద్ధ మేఘాలు.. మరణమా.. శరణమా..!

పహల్గామ్‌లో జరిగింది ముమ్మాటికీ నరమేథమే. కానీ.. పాకిస్తాన్ దుస్సాహసాల జాబితాలో ఇదే చివరిది కావాలి. సీమాంతర తీవ్రవాదానికి దీంతోనే ఫుల్‌స్టాప్ పడాలి. మరోసారి పాకిస్తాన్ భారత్ వైపు కన్నెత్తి చూడకూడదు. కశ్మీర్ గురించి మాట్లాడనే కూడదు. ఒకవేళ సైనికచర్యతోనే పాకిస్తాన్‌ దారికొస్తుందని భావిస్తే.. ప్రస్తుతానికి భారత్ ముందుండే మల్టిపుల్ ఆప్షన్లు ఏంటి..?

రగులుతోంది సరిహద్దు.. కమ్ముకున్న యుద్ధ మేఘాలు.. మరణమా.. శరణమా..!
India Vs Pakistan
Balaraju Goud
| Edited By: |

Updated on: Apr 30, 2025 | 7:03 PM

Share

దొంగదెబ్బ తీసింది వాడు. దగాపడ్డది, తీవ్రంగా గాయపడ్డది మనం. అమాయకుల ప్రాణాలు తోడుకెళ్లింది వాడు. కడుపు మండాల్సింది మనకు. నెత్తుటి రుచి మరిగి.. కన్నుమిన్నూ గానక మళ్లీమళ్లీ దుస్సాహసానికి తెగించింది వాడు. పోనీలే పక్కింటోడు కదా అని మానవతను చాటుకుంటూ వస్తున్నది మనం. అయినా సరే.. కావరం కరగలేదు వాడికి. మాటలు తూలుతూనే ఉన్నాడు. మరి.. యుద్ధంతోనే బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చేసిందా..? మనం సింధు జలాల ఒప్పందం అమలును నిలిపేస్తే.. వాడు సిమ్లా డీల్‌ను సస్పెన్షన్‌లో పెట్టాడు. మనం అటారీ చెక్‌పోస్టును మూసేస్తే.. పాకిస్తానోడు వాఘా సరిహద్దుల్లో గేట్లు తెరవబోనన్నాడు. మనం పాక్ జాతీయుల వీసాలను రద్దు చేస్తే.. వాళ్లు సార్క్ స్కీమ్ కింద మనకి న్యాయబద్ధంగా వచ్చిన వీసాలను కోసిపారేశారు. భారత్‌లో పాక్ ఎంబసీలను మనం ఖాళీ చేయిస్తే.. వాళ్లు మన డిఫెన్స్ అడ్వయిజర్స్‌ని వెనక్కి పంపేశారు. అరేబియా సముద్రంలో మనోళ్లు ఐఎన్‌ఎస్‌ సూరత్‌ని దించి సీస్కిమ్మింగ్‌ పరీక్షను విజయవంతంగా నిర్వహిస్తే.. పాకిస్తాన్ నేవీ కూడా కరాచీ, గ్వాదర్ పోర్టుల్లో అప్రమత్త కవాతు చేసి.. సబ్ మెరైన్లను కూడా ఓవరాలింగ్ చేసుకుని సిద్దం అంటోంది. అక్కడితోనే ఆగలేదు.. తమ గగనతలంలో మన విమానాలకు నో ఎంట్రీ బోర్డే పెట్టేసింది పాకిస్తాన్. వాస్తవాధీన రేఖ దగ్గర పాకిస్తాన్ బలగాలను పెంచుకుంది. ఇలా.. ప్రతీ ఎత్తుగడనూ మన దగ్గర కాపీకొట్టి టిట్‌ఫర్ టాట్ సౌండే ఇస్తూ వస్తోంది పాకిస్తాన్. భారత్‌ సత్తాను తెలిసి కూడా...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి