AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

6G network: 6జీ రేసులో ముందు వరుసలో భారత్‌.. పేటెంట్ హక్కుల్లో..

ఇదిలా ఉంటే అక్టోబర్‌ 15 నుంచి 24వ తేదీ వరకు భారత్‌ వరల్డ్ టెలికమ్యూనికేషన్స్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ (WTSA)కి ఆతిథ్యం ఇవ్వనుంది. ఢిల్లీ వేదికగా వేదికగా జరిగే ఈ సమావేశానికి ప్రపంచ నలుమూలల నుంచి అతిథులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో 6G విస్తరణతో పాటు, కృత్రిమ మేధస్సు, బిగ్‌ డేటా వంటి కీలకమైన సాంకేతిక అంశాలకు సంబంధించిన భవిష్యత్తులపై చర్చించనున్నారు...

6G network: 6జీ రేసులో ముందు వరుసలో భారత్‌.. పేటెంట్ హక్కుల్లో..
6g
Narender Vaitla
|

Updated on: Oct 14, 2024 | 12:54 PM

Share

6జీ నెట్‌వర్క్‌లో భారత్‌ దూకుడుమీదుంది. నెక్ట్స్‌ జనరేషన్‌ వైర్‌లెస్‌ టెక్నాలజీ రూపకల్పనలో భారత్‌ ప్రపంచంలోనే అగ్ర స్థానంలో దూసుకుతోంది. వివిధ అధ్యయనాల ఆధారంగా 6G టెక్నాలజీకి సంబంధించిన పేటెంట్‌లను దాఖలు చేయడంలో దేశం ప్రపంచవ్యాప్తంగా 6వ స్థానంలో నిలిచింది. ఇది 6జీ స్టాండర్డ్‌ ప్రాసెస్‌పై ఆశాజన సూచికగా నిలుస్తోంది.

ఇదిలా ఉంటే అక్టోబర్‌ 15 నుంచి 24వ తేదీ వరకు భారత్‌ వరల్డ్ టెలికమ్యూనికేషన్స్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ (WTSA)కి ఆతిథ్యం ఇవ్వనుంది. ఢిల్లీ వేదికగా వేదికగా జరిగే ఈ సమావేశానికి ప్రపంచ నలుమూలల నుంచి అతిథులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో 6G విస్తరణతో పాటు, కృత్రిమ మేధస్సు, బిగ్‌ డేటా వంటి కీలకమైన సాంకేతిక అంశాలకు సంబంధించిన భవిష్యత్తులపై చర్చించనున్నారు. ఈ కార్యక్రమానికి 190 దేశాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు. ఆసియాలో ఈ సభ జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం.

ఇందులో భాగంగానే ఢిల్లీ టెక్నికల్ యూనివర్శిటీ (ఢిల్లీ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (బెంగళూరు)తో పాటు.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (హైదరాబాద్)లో సెషన్స్‌ జరిగాయి. ఈ కార్యక్రమంలోనే ITU, నేషనల్ కమ్యూనికేషన్ అకాడమీ, టెలికాం ఇంజినీరింగ్ సెంటర్, సీనియర్ ప్రొఫెసర్లతో పాటు టెలికాం పరిశ్రమకు చెందిన ప్రముఖ నిపుణులు పాల్గొన్నారు. గ్లోబల్ కనెక్టివిటీ, ఇన్నోవేషన్‌ను పెంపొందించడంలో టెలికాం ప్రమాణాల కీలక పాత్ర గురించి విద్యార్థులతో చర్చలు జరిపారు. 5Gతో పాటు 6G వంటి సాంకేతికతల విస్తరణకు స్టాండర్డైజేషన్ ఎలా ఉపయోగపడుతుంది.? ఇంటర్‌ ఆపరేబిలిటీని నిర్ధారించడంతో పాటు గ్లోబల్ టెలికమ్యూనికేషన్‌ల భవిష్యత్తును ఎలా ప్రభావితం చేయనుందని ఇందులో ప్రస్తావించారు.

ఈ కార్యక్రమానికి 500 కంటే ఎక్కువ మంది విద్యార్థులు హాజరయ్యారు. అలాగే 450 కంటే ఎక్కు మంది వర్చువల్‌గా కార్యక్రమంలో పాల్గొన్నారు. టెలికాం రంగంలో భారతదేశ నాయకత్వాన్ని రూపొందించడంలో, టెలికాం రంగ ప్రాముఖ్యతను తెలుసుకోవడంలో ఈ సెషన్స్‌ యువకులకు మంచి అవకాశమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..