Mid Day Meal: దళిత మహిళలు వంటచేశారని.. ఆ విద్యార్థులు ఏం చేశారంటే..?

Mid Day Meal: పెద్దలే కాదు.. పిల్లల్లోనూ కుల వివక్షకు సంబంధించి విష బీజాలు నాటుకుంటున్నాయి. దీనికి సంబంధించి ఘటన తాజాగా ఉత్తరాఖండ్‌లో వెలుగు చూసింది.

Mid Day Meal: దళిత మహిళలు వంటచేశారని.. ఆ విద్యార్థులు ఏం చేశారంటే..?
School
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 21, 2021 | 9:25 AM

Mid Day Meal: పెద్దలే కాదు.. పిల్లల్లోనూ కుల వివక్షకు సంబంధించి విష బీజాలు నాటుకుంటున్నాయి. దీనికి సంబంధించి ఘటన తాజాగా ఉత్తరాఖండ్‌లో వెలుగు చూసింది. దళిత మహిళ వంట చేసిందనే కారణంతో ప్రభుత్వ పాఠశాలలోని కొందరు విద్యార్థులు ఆ ఆహారాన్ని తినడానికి నిరాకరించారు. ఉత్తరాఖండ్‌లోని చంపావత్‌ జిల్లా సుఖిధాంగ్‌లోని ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ వ్యవహారం సంచలనంగా మారడంతో.. అధికారులు స్పందించారు. ఘటనపై విచారణకు ఆదేశించారు.

సుఖిధాంగ్‌లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 60 మంది విద్యార్థుల్లో 40 మంది విద్యార్థులు జనరల్ కేటగిరికి చెందిన వారే. మిగతా 20 మంది షెడ్యూల్ కులాలకు చెందిన వారు ఉన్నారు. అయితే కొద్ది రోజుల క్రితమే ఆ పాఠశాలలో మధ్యాహ్నం భోజనాలు వండే మహిళ ఉద్యోగ విరమణ పొందింది. ఆమె తరువాత షెడ్యూల్ కులానికి చెందిన సునీతా దేవి.. మధ్యామ్నం భోజనాలు వండేందుకు ఉద్యోగంలో చేరింది. కాగా, తాజాగా ఆమె పాఠశాలలో భోజనం వండగా.. స్కూల్‌లోని జనరల్ కేటగిరి విద్యార్థులు నిరాకరించారు. మరోవైపు ఆ విద్యార్థులు తల్లిదండ్రులు సైతం స్కూల్‌కు వచ్చి ఆందోళన చేపట్టారు. స్కూల్‌లో జనరల్ కేటగిరీ విద్యార్థులే ఎక్కువగా ఉంటారు కాబట్టి.. ఈ కేటగిరికి చెందిన మహిళలనే వంట వారిగా నియమించాలని డిమాండ్ చేశారు. ప్రధానోపాధ్యాయుని తీరుపై విమర్శలు గుప్పించారు. దాంతో పాఠశాల వద్ద కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది.

అయితే, ఈ ఘటన స్థానికంగా పెను ప్రకంపనలు సృష్టించింది. కుల వివక్ష చూపుతున్నారంటూ భోజనం వండిన మహిళ పోలీస్ స్టేషన్‌లో, విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసింది. మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రులు సైతం విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణకు ఆదేశించారు అధికారులు. అసలేం జరిగిందని వివరాలు సేకరించారు.

Also read:

పోలీసులు లంచం తీసుకుంటే పని కచ్చితంగా చేస్తారట.. ఈ విషయం పోలీస్‌ అధికారే చెబుతున్నాడు.. వీడియో చూడండి..

Dalailama: మత సామరస్యం విషయంలో భారత్‌ ప్రపంచానికే మార్గదర్శి.. ఇక్కడి ప్రజల జీవనం నన్నెంతగానో ఆకట్టుకుంటోంది: దలైలామా

UP Politics: హీటెక్కిన యూపీ ఎన్నికల ప్రచారం.. జనంలోకి బీజేపీ.. సీఎం యోగిను టార్గెట్ చేసిన అఖిలేశ్‌, ప్రియాంక!