ఏకాంతంగా గడపాలని నమ్మించి.. కరెంట్ షాక్ తో భర్తను చంపేసింది.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు

పెళ్లైన కొన్నాళ్లకే మరో వ్యక్తితో పరిచయం పెంచుకుంది. తన సంబంధానికి అడ్డొస్తున్నాడన్న కారణంతో దారుణానికి పాల్పడింది. కొత్తగా పెళ్లయింది..వేరు ఇంట్లో నిద్రపోతామని ఇంట్లో వాళ్లను నమ్మించింది. ఏకాంతంగా గడపాలంటూ భర్తను..

ఏకాంతంగా గడపాలని నమ్మించి.. కరెంట్ షాక్ తో భర్తను చంపేసింది.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు
Crime News
Ganesh Mudavath

|

Sep 18, 2022 | 8:51 AM

పెళ్లైన కొన్నాళ్లకే మరో వ్యక్తితో పరిచయం పెంచుకుంది. తన సంబంధానికి అడ్డొస్తున్నాడన్న కారణంతో దారుణానికి పాల్పడింది. కొత్తగా పెళ్లయింది..వేరు ఇంట్లో నిద్రపోతామని ఇంట్లో వాళ్లను నమ్మించింది. ఏకాంతంగా గడపాలంటూ భర్తను తనతో పాటు తీసుకెళ్లింది. అర్ధరాత్రి సమయంలో భర్తకు కరెంట్ షాక్ ఇచ్చి చంపేసింది. ఏమీ తెలియనట్లు కుటుంబీకులకు సమాచారం ఇచ్చింది. ప్రమాదవశాత్తు జరిగిందనే భావించిన కుటుంబసభ్యులకు కాల్ రికార్డింగ్ ఆధారంగా కీలక సమాచారాన్ని గుర్తించారు. కోడలే.. తన ప్రియుడితో కలిసి కుమారుడిని చంపేసిందని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా సంచలన విషయాలు తెలిశాయి. ఉత్తర ప్రదేశ్‌లోని మథుర జిల్లా బల్దేవ్‌ పోలీస్‌స్టేషను పరిధిలోని సేల్‌ఖేఢా గ్రామంలో సుబేదార్‌సింగ్‌ అతి కుటుంబంతో కలిసి నివాసముంటున్నారు. ఈ ఏడాది మార్చిలో అతని చిన్న కుమారుడు మాన్వేంద్రకు వివాహం చేశాడు. గ్రామ శివారులో వారికి మరో ఇల్లు ఉంది. పెళ్లయిన కొన్నాళ్ల తర్వాత మాన్వేంద్ర దంపతులు ఓ రోజు రాత్రి ఆ ఇంట్రో నిద్రించారు. అర్ధరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత కోడలు.. తన మామకు ఫోన్ చేసి మాన్వేంద్ర విద్యుదాఘాతానికి గురయ్యాడని తెలిపింది. వెంటనే అప్రమత్తమైన కుటుంబసభ్యులు మాన్వేంద్రను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అతనిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మాన్వేంద్ర చనిపోయినట్లు నిర్ధరించారు.

ప్రమాదవశాత్తు కొడుకు చనిపోయాడని భావించిన తల్లిదండ్రులు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. మాన్వేంద్ర చనిపోయిన కొన్ని రోజులకు అతని ఫోన్ కు కాల్స్‌ విపరీతంగా వచ్చేవి. దీంతో అనుమానం వ్యక్తం చేసిన సుబేదార్‌ మాన్వేంద్ర ఫోన్ ను దాచి పెట్టాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫోన్ కు వచ్చే కాల్స్ ను పరిశీలించాడు. ఫోన్ లో తన కోడలు (మాన్వేంద్ర భార్య) వేరే వ్యక్తితో మాట్లాడిన కాల్ రికార్డ్ బయటపడింది. అందులో నువ్వు చెప్పినట్టే 10 నిమిషాలు కరెంట్‌ షాక్‌ ఇచ్చాను అని కోడలు చెప్పడాన్ని గుర్తించాడు. ఆడియో ఆధారంగా కోడల్ని నిలదీశాడు. ఆమె సరైన సమాధానం ఇవ్వకపోవడంతో పోలీసులకు కంప్లైంట్ చేశాడు.

కోడలు, ఆమె ప్రియుడిని విచారణ చేస్తున్న సమయంలో పోలీసులు కీలక సమాచారం రాబట్టారు. భర్తను తానే చంపినట్లు ఒప్పుకుంది. మాన్వేంద్ర చనిపోయిన తర్వాత పుట్టింటికి వెళ్లిన ఆమె.. ప్రియుడు అతేంద్రతో కలిసి అటునుంచి అటే ప్రియుడితో కలిసి పరారైంది. కాగా.. సుబేదార్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు పరారీలో ఉన్న ఇద్దరినీ పట్టుకున్నారు. ఈ ఘటన గ్రామంలో సంచలనంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu