AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttar Pradesh: ఏడాదిన్నరగా ఇంట్లోనే మృతదేహం.. గ్రామస్థులకు కట్టుకథలు చెబుతూ.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్

ఎవరైనా చనిపోతే.. ఒకరోజు లేదా రెండు రోజులు మృతదేహాన్ని ఇంట్లో ఉంచుకుంటారు. ముఖ్యమైన వాళ్లు రావాల్సి ఉంటే మరో వారం రోజుల వరకు బాడీని పెట్టుకుంటారు. కానీ ఉత్తరప్రదేశ్ లో మాత్రం ఓ ఫ్యామిలీ డెడ్ బాడీని ఏకంగా..

Uttar Pradesh: ఏడాదిన్నరగా ఇంట్లోనే మృతదేహం.. గ్రామస్థులకు కట్టుకథలు చెబుతూ.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్
child illness
Ganesh Mudavath
|

Updated on: Sep 24, 2022 | 8:28 AM

Share

ఎవరైనా చనిపోతే.. ఒకరోజు లేదా రెండు రోజులు మృతదేహాన్ని ఇంట్లో ఉంచుకుంటారు. ముఖ్యమైన వాళ్లు రావాల్సి ఉంటే మరో వారం రోజుల వరకు బాడీని పెట్టుకుంటారు. కానీ ఉత్తరప్రదేశ్ లో మాత్రం ఓ ఫ్యామిలీ డెడ్ బాడీని ఏకంగా సంవత్సరంన్నర రోజులు ఇంట్లోనే ఉంచుకుంది. కనీసం మృతదేహానికి అంత్యక్రియలు కూడా నిర్వహించలేదు. దీంతో డెడ్ బాడీ కుళ్లిపోయింది. ఎంతగా అంటే.. ఎముకల్లోని మజ్జ కూడా ఇంకిపోయేంతగా.. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని శివపురి గ్రామంలో విమలేశ్ అనే వ్యక్తి నివాసముంటున్నారు. ఆయన అహ్మదాబాద్​లో ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో విధులు నిర్వహిస్తూ 2021 ఏప్రిల్​ 22న మృతి చెందాడు. అయితే కుటుంబసభ్యులు అతని మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించలేదు. విమలేశ్ కనిపించకపోవడంతో గ్రామస్థులు ఆరా తీశారు. అయితే విమలేశ్ అనారోగ్యంతో బాధపడుతున్నాడని, అతడు కోమాలో ఉన్నాడని డాక్టర్లు ట్రీట్ మెంట్ చేస్తున్నారని అందరినీ నమ్మించారు.

కాగా.. విమలేశ్​భార్య మిథాలీ స్థానిక కో-ఆపరేటివ్​బ్యాంకు​లో మేనేజర్​గా పని చేస్తోంది. పెన్షన్ కు అప్లై చేసుకునేందుకు విమలేశ్​మరణ ధ్రువీకరణ పత్రాన్ని ఆమె సమర్పించడంతో ఈ విషయం బయటకు వచ్చింది. వెంటనే అలర్ట్ అయిన ఆదాయ పన్నుశాఖ ఈ విషయాన్ని సీఎంవోకు తెలిపింది. వెంటనే మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవాలని సీఎంఓ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు విమలేశ్ ఇంటికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని అంబులెన్స్​లో స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. డెడ్ బాడీని పరీక్షించిన వైద్యులు.. విమలేశ్​మృతదేహం పూర్తిగా చెడిపోయిందని గుర్తించారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదిన్నరగా మృతదేహాన్ని ఎలా ఇంట్లో ఉంచుకుంటారని మండిపడుతున్నారు. ఈ ఘటన స్థానికంగా పెను సంచలనం కలిగించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి