AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Newly Married: ఫస్ట్ నైట్ రోజే కొంప ముంచిన కొత్త కోడలు.. దెబ్బకు అంతా షాక్..

Newly Married: కొడుక్కి పెళ్లి చేసిన అత్తామామలు.. కొత్త కోడలు ఇంట్లో అడుగు పెట్టగానే సంబరపడిపోయారు. తమ కూతురులా చూసుకుంటామంటూ మురిసిపోయారు. కానీ, ఆ మురిపెం కాసేపైనా ఉంచలేదు కొత్త కోడలు.

Newly Married: ఫస్ట్ నైట్ రోజే కొంప ముంచిన కొత్త కోడలు.. దెబ్బకు అంతా షాక్..
Married Woman
Shiva Prajapati
|

Updated on: Aug 10, 2022 | 2:22 PM

Share

Newly Married: కొడుక్కి పెళ్లి చేసిన అత్తామామలు.. కొత్త కోడలు ఇంట్లో అడుగు పెట్టగానే సంబరపడిపోయారు. తమ కూతురులా చూసుకుంటామంటూ మురిసిపోయారు. కానీ, ఆ మురిపెం కాసేపైనా ఉంచలేదు కొత్త కోడలు. ఫస్ట్ నైట్ రోజే అందరికీ ఊహించని షాక్ ఇచ్చి.. వారి సంతోషాన్ని కాస్తా దుఖమయం చేసేసింది. ఇంతకీ ఆ పెళ్లి కూతురు ఏం చేసింది? అక్కడ ఏం జరిగింది? ఇప్పుడు తెలుసుకుందాం..

రాజస్థాన్‌లోని జైపూర్ జిల్లా కోట్‌పుట్లీ పట్టణానికి చెందిన వ్యక్తి, అదే ప్రాంతానికి చెందిన ఓ యువతికి పెళ్లి చేశారు పెద్దలు. పెళ్లి తంతు ముగిశాక.. నవ వధువును పెళ్లి కొడుకు ఇంటికి తీసుకువచ్చారు. వారి ఫస్ట్ నైట్ కోసం పెద్దలు ఏర్పాటు చేశారు. ఇంతలో అందరూ కలిసి భోజనం చేసేందుకు సిద్ధమయ్యారు. కొత్త కోడలే వారికి భోజనం వడ్డించింది. తాను తప్ప.. భర్త, అత్త, మామ, ఇతర కుటుంబ సభ్యులందరికీ వడ్డించింది. ఆమె తినకపోవడంతో, మర్యాద పాటిస్తుందేమో అని భావించారు. అయితే, అక్కడే బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. ఆ వడ్డించిన భోజనంలో మత్తు మందు కలిపింది పెళ్లి కూతురు. అది తెలియక.. ఆ భోజనం తిన్నవారంతా అపస్మారకస్థితిలోకి జారుకున్నారు. ఇంకేముందు.. తన ప్లాన్ షురూ చేసింది ఆ మాయ పెళ్లి కూతురు. ఇంట్లో ఉన్న డబ్బులు, నగలు అన్నీ ఎత్తుకెళ్లింది. మరుసటి రోజు ఉదయం బారెడు పొద్దెక్కినా ఇంట్లో నుంచి ఎవరూ రాకపోవడంతో స్థానికులకు అనుమానం కలిగింది. వెంటనే లోపలికి వెళ్లి చూడగా.. అందరూ అపస్మాకర స్థితిలో పడిపోయి ఉన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. బాధితులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తులో షాకింగ్ నిజాలు తెలుసుకున్నారు. పెళ్లి కూతురు పెద్ద చీటర్ అని, దొంగ పెళ్లిళ్లు చేసుకుంటూ జనాలను మోసం చేయడమే వారి పని అని తేల్చారు పోలీసులు. పరారీలో ఉన్న పెళ్లి కూతురు కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..