AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: వరుడు సమయానికి రాలేదని.. వధువుకు మరో వ్యక్తితో పెళ్లి చేశారు.. మైండ్ బ్లోయింగ్ ఇన్సిడెంట్

కరెక్టుగా తాళి కట్టే సమయంలో ఆపండి.. అంటూ ఓ అరుపు. సినిమాల్లో ఇలాంటి సీన్లు కామన్. కానీ రియల్ లైఫ్ లోనూ సినిమాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. చిన్న చిన్న కారణాలకే ఊహించని ట్విస్టులు...

Maharashtra: వరుడు సమయానికి రాలేదని.. వధువుకు మరో వ్యక్తితో పెళ్లి చేశారు.. మైండ్ బ్లోయింగ్ ఇన్సిడెంట్
Ganesh Mudavath
|

Updated on: Apr 29, 2022 | 3:57 PM

Share

కరెక్టుగా తాళి కట్టే సమయంలో ఆపండి.. అంటూ ఓ అరుపు. సినిమాల్లో ఇలాంటి సీన్లు కామన్. కానీ రియల్ లైఫ్ లోనూ సినిమాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. చిన్న చిన్న కారణాలకే ఊహించని ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. వధూవరులు గొడవ పడడం, ఆఖరి నిమిషంలో పెళ్లిల్లు క్యాన్సిల్ అవ్వడం, పెళ్లి కొడుకో పెళ్లి కూతురో మారిపోవడం వంటివి మనం చూస్తూనే ఉన్నాం. కానీ మహారాష్ట్రలో జరిగిన ఓ పెళ్లి మాత్రం అక్కడికి వచ్చిన వారిని షాక్ కు గురి చేసింది.వరుడు తన పెళ్లికే సమయానికి వెళ్లలేదు. దాంతో పెళ్లి కూతురుకు వేరే వ్యక్తిని ఇచ్చి పెళ్లి చేసేశారు. మహారాష్ట్రలోని(Maharashtra) బుల్దానా జిల్లాలోని మల్కాపూర్ పాంగ్రాలో ఏప్రిల్ 22న పెళ్లి జరగాల్సి ఉంది. సాయంత్రం నాలుగు గంటలకు పెళ్లి(Marriage) ముహూర్తం నిశ్చయించారు. పెళ్లి మండపానికి వధువు, ఆమె కుటుంబ సభ్యులు, ఇతర బంధువులు, స్నేహితులు అందరూ చేరుకున్నారు. వివాహానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కానీ వరుడు రాలేదు. వరుడు, అతని స్నేహితులు సమయానికి పెళ్లి వేదిక దగ్గరకు వెళ్లకుండా మద్యం తాగుతూ, డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు. సాయంత్రం నాలుగు గంటలకు పెళ్లి అయితే వరుడు రాత్రి ఎనిమిది గంటలకు పెళ్లి మండపానికి వెళ్లాడు.

ఆలస్యంగా వెళ్లిన వరుడుకి, పెళ్లి కూతురు తండ్రి షాక్ ఇచ్చాడు. తన కుమార్తెను వరుడికి ఇచ్చి పెళ్లి చేసేందుకు నిరాకరించి, అక్కడే ఉన్న బంధువుల్లో ఒకరితో ఆమెకు పెళ్లి చేశాడు. వరుడు సమయానికి రాలేదని, అందుకే బంధువుల్లో వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశానని వధువు తండ్రి చెప్పాడు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇదీ చదవండి

AP 10th Exams Paper Leak: 3 రోజులుగా లీకౌతున్న టెన్త్‌ క్వశ్చన్‌ పేపర్లు! నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోన్న విద్యాశాఖ..?