Maharashtra: నడుస్తున్న రైలునుంచి దూకేసిన ముగ్గురు యువతులు.. లక్కంటే వీరిదే.. వీడియో వైరల్
Maharashtra: కదులుతున్న రైల్లోనుంచి ముగ్గురు అమ్మాయిలు ఒకరి తర్వాత ఒకరు కిందకు దూకేశారు. అది గమనించిన హోం గార్డ్ (Home Guard ) వెంటనే అప్రమత్తమయ్యాడు. లేకపోతే జరగకూడనిదే జరిగిపోయేది...
Maharashtra: కదులుతున్న రైల్లోనుంచి ముగ్గురు అమ్మాయిలు ఒకరి తర్వాత ఒకరు కిందకు దూకేశారు. అది గమనించిన హోం గార్డ్ (Home Guard ) వెంటనే అప్రమత్తమయ్యాడు. లేకపోతే జరగకూడనిదే జరిగిపోయేది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.. ముంబైలోని(Mumbai) జోగేశ్వరి రైల్వే స్టేషన్‌లో ఏప్రిల్ 16న ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఓ రైలు వచ్చి ప్లాట్‌ఫారమ్‌పై ఆగింది. కాసేపటికి మళ్లీ కదిలేందుకు సిద్ధమైంది. మెల్లగా కదులుతున్న సందర్భంలో ఉన్నట్టుండి ఓ యువతి ప్లాట్‌ఫారమ్ మీదకు జంప్ చేసింది. ఈ క్రమంలో అదుపుతప్పి రైలు కింద పడబోయింది. అదే బోగీలో ఉన్న హోంగార్డు యువతిని గమనించి, వెంటనే తానూ కిందకు దూకి యువతిని పక్కకు లాగేశాడు. ప్రాణాపాయం తప్పడంతో అక్కడున్న ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలోనే మరో ఇద్దరు యువతులు కూడా ఒకరి తర్వాత ఒకరు కిందకు దూకేశారు.
ఈ ప్రమాదంలో ముగ్గురు యువతులూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి, యువతి ప్రాణాలను కాపాడిన హోంగార్డును అంతా అభింనదించారు. ఈ ఘటన మొత్తం ప్లాట్‌ఫారమ్‌పై అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. ఈ వీడియోను ముంబై రైల్వే పోలీస్ కమిషనర్ కుషెర్ ఖలీద్.. తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. హోంగార్డును అభినందిస్తూనే.. రైలు కదులుతున్న సమయంలో ప్రయాణికులు ఇలా చేయడం ప్రమాదకరమంటూ సూచించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు హోంగార్డును ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
Home Guard Altaf Shaikh working @grpmumbai saved the life of a lady passenger who fell down during boarding a suburban train at Jogeshwari station on 16/4/22. He is being rewarded for his presence of mind, alertness & dedication to duty @drmbct @DGPMaharashtra @Dwalsepatil pic.twitter.com/1td8B7YLOp
— Quaiser Khalid IPS कैसर खालिद قیصر خالد (@quaiser_khalid) April 25, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Read: Telangana: ఎనిమిదో విడత హరితహారం.. ఈ ఏడాది 19 .50 కోట్ల మొక్కలు నాటే దిశగా ప్రణాళికలు