Social Media: సోషల్ మీడియాలో ఛాటింగ్.. ముఖాలు చూసుకుని ఫ్యూజులౌట్.. చివరకు ఊహించని విధంగా..

సోషల్ మీడియా (Social Media) పుణ్యమా అని ప్రస్తుత కాలంలో నేరాలు విపరీతంగా పెరుగిపోతున్నాయి. ఫేక్ అకౌంట్లతో చాటింగ్ లు, నకిలీ ఖాతాలలో కవ్వింపులకు పాల్పడుతూ తెలిసీ తెలియక నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ ఇండోర్ లో...

Social Media: సోషల్ మీడియాలో ఛాటింగ్.. ముఖాలు చూసుకుని ఫ్యూజులౌట్.. చివరకు ఊహించని విధంగా..
Crime News
Follow us
Ganesh Mudavath

|

Updated on: Sep 01, 2022 | 12:49 PM

సోషల్ మీడియా (Social Media) పుణ్యమా అని ప్రస్తుత కాలంలో నేరాలు విపరీతంగా పెరుగిపోతున్నాయి. ఫేక్ అకౌంట్లతో చాటింగ్ లు, నకిలీ ఖాతాలలో కవ్వింపులకు పాల్పడుతూ తెలిసీ తెలియక నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ ఇండోర్ లో ఇలాంటి ఘటనే జరిగింది. భార్య పుట్టింటికి వెళ్లడంతో.. ఓ వ్యక్తి సోషల్ మీడియాలో చాటింగ్ చేయడం మొదలెట్టాడు. అవతలి వైపు ఉన్న వారు నిజమో కాదో తెలుసుకోకుండా హద్దులు దాటారు. ఆమెను ఇంటికి రావాలని కోరాడు. ఆమె తిరస్కరించడంతో బలవంతంగా ఒప్పించాడు. తీరా ఆమె ఇంటికి వెళ్లాక.. సీన్ చూసి నిర్ఘాంతపోయాడు. ఎందుకంటే అక్కడికి వెళ్లింది ఓ ట్రాన్స్ జెండర్ కాబట్టి. ఊహించని ఈ ఘటనకు అతనికి కోపం చిర్రెత్తుకొచ్చింది. గొడవ పెట్టుకుని విచక్షణ కోల్పోయాడు. కత్తితో గొంతు కోసి హతమార్చాడు. చివరకు ఊహించని విధంగా పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లోని ఖజ్రానా ప్రాంతానికి చెందిన నూర్ మహమ్మద్ తన భార్యతో కలిసి నివాసముంటున్నాడు. కొన్ని రోజుల క్రితం ఆమె పుట్టింటికి వెళ్లింది. మహమ్మద్ ఒక్కడే ఇంట్లో ఉండేవాడు. ఈ క్రమంలో అతను సోషల్ మీడియాతో ఓ యువతితో చాటింగ్ చేసేవాడు. కాగా మహమ్మద్ తో చాటింగ్ చేస్తున్నది ట్రాన్స్ జెండర్. ఈ విషయం అతనికి తెలియదు.

ఛాటింగ్ కారణంగా వీరిద్దరి మధ్య చనువు పెరిగింది. కొన్నాళ్లు వీరి చాటింగ్ సజావుగానే సాగింది. కొద్ది రోజుల క్రితం భార్య పుట్టింటికి వెళ్లడంతో అతను తన సోషల్ మీడియా ఫ్రెండ్ ను ఇంటికి రావాలని కోరాడు. ఆమె రాలేనని చెప్తే ఏదో ఒకటి చెప్పి ఒప్పించాడు. ఇంటికి వచ్చాకే తనతో చాటింగ్ చేసింది యువతి కాదని, ట్రాన్స్ జెండర్ అని తెలుసుకుని నిర్ఘాంతపోయాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం నెలకొంది. కోపంలో మహమ్మద్ ఆమె గొంతు కోశాడు. ఊహించని ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత మృతదేహాన్ని రెండు ముక్కలుగా చేసి, అందులో ఒక భాగాన్ని సంచిలో వేసి బైపాస్‌ సమీపంలోని పొదల్లోకి పడేశాడు. మరో భాగాన్ని పారేయలేక తన ఇంట్లోనే భద్రపరిచాడు.

కాగా.. ఇండోర్ సమీపంలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు ఛిద్రమైన మహిళ మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతి గా కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేస్తుండగా వారికి షాకింగ్ విషయాలు తెలిశాయి. తాము గుర్తించింది మృతదేహంలో సగ భాగమేనని, మిగతా భాగం ఎక్కడుందనే విషయం ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఆమెతో ఎవరెవరు సన్నిహితంగా ఉన్నారనే విషయాలను ఆరా తీయగా వారికి మహమ్మద్ గురించి తెలిసింది. అతని ప్రవర్తనపై అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. నూర్‌మహ్మద్‌ ఇంటి నుంచి మిగతా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం