Live in Relation: రెండేళ్లుగా లివ్ ఇన్ రిలేషన్.. వారంలో పెళ్లి.. అంతలోనే ఊహించని విధంగా వరుడు..

సోషల్ మీడియాలో ఏర్పడిన పరిచయం లివ్ ఇన్ రిలేషన్ కు దారి తీసింది. ఇద్దరి ఆలోచనలు, భావాలు కలవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇంట్లో చెప్పి ఒప్పించారు. అయితే పెళ్లికి వారం రోజుల తర్వాత..

Live in Relation: రెండేళ్లుగా లివ్ ఇన్ రిలేషన్.. వారంలో పెళ్లి.. అంతలోనే ఊహించని విధంగా వరుడు..
Crime News
Follow us
Ganesh Mudavath

|

Updated on: Sep 20, 2022 | 8:13 PM

సోషల్ మీడియాలో ఏర్పడిన పరిచయం లివ్ ఇన్ రిలేషన్ కు దారి తీసింది. ఇద్దరి ఆలోచనలు, భావాలు కలవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇంట్లో చెప్పి ఒప్పించారు. అయితే పెళ్లికి వారం రోజుల తర్వాత యువకుడు చనిపోవడం కలకలం రేపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా సంచలన విషయాలు తెలిశాయి. కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో నివాసముండే వికాస్ రాజన్.. ఉక్రెయిన్ లో MBBS పూర్తి చేశాడు. ప్రాక్టీస్ కోసం చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేరాడు. సెషన్ పూర్తయిన తర్వాత మరో ఉద్యోగం రావడంతో బెంగళూరుకు వెళ్లాడు. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. రెండేళ్ల క్రితం రాజన్ కు సోషల్ మీడియా ద్వారా ఆర్కిటెక్ట్ ప్రతిభతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం మరింత సన్నిహితంగా మారడంతో ఇద్దరూ లివ్ ఇన్ రిలేషన్ షిప్ ప్రారంభించారు. కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. ఈ విషయాన్ని ఇరు కుటుంబాలకు చెప్పి ఒప్పించారు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం రాజన్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు. పరిస్థితి విషమించడంతో అతను కోమాలోకి వెళ్లిపోయాడు. అనంతరం మూడు రోజుల తరువాత మృతి చెందాడు.

సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. రాజన్ శరీరంపై తీవ్ర గాయాలైనట్లు గుర్తులు ఉండటంతో పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకున్నారు. అయితే వారి విచారణలో షాకింగ్ విషయాలు తెలిశాయి. రాజన్ కు కాబోయే భార్య తన స్నేహితులతో కలిసి రాజన్‌పై దాడి చేసినట్లు గుర్తించారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో అతణ్ని ఆసుపత్రిలో చేర్చారు. అయితే.. రాజన్ ఇన్ స్టా గ్రామ్ లో ప్రతిభ తన నగ్న చిత్రాలు ఉండటాన్ని గమనించింది. ఈ విషయంపై రాజన్ ను అడగగా.. కేవలం ఫేక్ అకౌంట్ ద్వారా సరదా కోసమే ఇలా చేసినట్లు చెప్పాడు. అతని సమాధానంతో ప్రతిభ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అతనితో గొడవకు దిగింది.

అదే రోజున తన స్నేహితులతో కలిసి గెట్ టుగెదర్ ప్లాన్ చేసింది. డాక్టర్ రాజన్‌ను తన వెంట తీసుకెళ్లింది. మద్యం సేవించిన తర్వాత వారి మధ్య ఈ విషయంపై మాటలు వచ్చాయి. మాటామాటా పెరిగి గొడవకు దారి తీసింది. ప్రతిభ, ఆమె స్నేహితులు డాక్టర్ రాజన్‌పై ఫ్లోర్ మాప్‌తో దాడి చేశారు. ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమించడంతో ప్రతిభ ఆసుపత్రికి తరలించింది. అనంతరం రాజన్ కోమాలోకి వెళ్లి, మూడు రోజుల తర్వాత ప్రాణాలు కోల్పోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రతిభతో పాటు ఆమె ముగ్గురు స్నేహితులైన గౌతమ్, సుశీల్, సునీల్‌లను పలు సెక్షన్ల కింద అరెస్టు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..