ఆప్గాన్ తాలిబన్ మంత్రితో జైశంకర్ చర్చలు.. నెట్టింట వైరల్ అవుతున్న ఇరు దేశాల ట్వీట్స్!
భారత్ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ గురువారం తాలిబన్ల తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకితో అధికారికంగా ఫోన్ కాల్ మాట్లాడారు. ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ ప్రభుత్వంతో భారత్ చేసిన తొలి మంత్రి స్థాయి సంప్రదింపులు కావడంతో సర్వత్రా ప్రాముఖ్యత సంతరించుకుంది..

న్యూఢిల్లీ, మే 16: భారత్ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ గురువారం తాలిబన్ల తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకితో అధికారికంగా ఫోన్ కాల్ మాట్లాడారు. ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ ప్రభుత్వంతో భారత్ చేసిన తొలి మంత్రి స్థాయి సంప్రదింపులు కావడంతో సర్వత్రా ప్రాముఖ్యత సంతరించుకుంది. జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది పర్యాటకులను చంపడంపై యావత్ ప్రపంచం స్పందించింది. దీనిలో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ ప్రభుత్వం కూడా ఈ దాడిని ఖంచడాన్ని మంత్రి జైశంకర్ స్వాగతించారు. ఈ విషయాన్ని మంత్రి జైశంకర్ స్వయంగా తన అధికారిక ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. తాలిబన్‌తో తొలిసారి మంత్రిత్వ స్థాయి చర్చలు జరపడం గమనార్హం. తాలిబన్ ప్రభుత్వంలో ఫోన్ సంభాషణ తర్వాత జైశంకర్.. ‘ఈ రోజు సాయంత్రం తాత్కాలిక ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి మౌలవి అమీర్ ఖాన్ ముత్తాకీతో మంచి సంభాషణ జరిగింది. పహల్గామ్ ఉగ్రవాద దాడిని ఆయన ఖండించడం హర్షణీయం. ఆఫ్ఘన్ ప్రజలతో భారత్ సాంప్రదాయ స్నేహాన్ని కొనసాగిస్తాం. వారి అభివృద్ధి అవసరాలకు సహకారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే అంశాలపై చర్చించామని’ ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టారు.
పాక్ తప్పుడు ప్రచారాన్ని అఫ్గాన్ తిప్పికొట్టడంపై జైశంకర్ హర్షం..
జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన సంఘటనలతో తాలిబన్లను ముడిపెడుతున్నారని ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేసింది. భారత్ ప్రయోగించిన ఓ క్షిపణి అఫ్గాన్ భూభాగంలో పడినట్లు పాక్ తప్పుడు ప్రచారం చేసింది. అయితే దీన్ని కాబూల్ ఖండించింది. తమకు ఎలాంటి హాని జరగలేదని, అదంతా అవాస్తవమేనని వెల్లడించింది. ఇలాంటి తప్పుడు, నిరాధారమైన ప్రచారాల ద్వారా భారత్ – ఆఫ్ఘనిస్తాన్ మధ్య అపనమ్మకాన్ని సృష్టించడానికి పాక్ చేసిన ప్రయత్నాలను ఆప్ఘన్ తిరస్కరించడాన్ని జైశంకర్ స్వాగతించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు. తాలిబన్ కమ్యూనికేషన్ డైరెక్టర్ హఫీజ్ జియా అహ్మద్ కూడా వీరి ఫోన్ కాల్ అనంతరం ఎక్స్‌లో వరుస పోస్టులు పెట్టారు.. వైద్య సహాయం కోరే ఆఫ్ఘన్ ప్రజలకు మరిన్ని వీసాలు అందించాలని ఈ ఫోన్ కాల్‌లో జైశంకర్‌ను ముత్తాకి కోరారు. ద్వైపాక్షిక వాణిజ్యం, భారత జైళ్లలో ఉన్న ఆఫ్ఘన్ ఖైదీలను విడుదల చేయడం, తిరిగి ఇవ్వడం, ఇరాన్‌లోని చాబహార్ ఓడరేవు అభివృద్ధి గురించి కూడా చర్చించినట్లు ఆయన ప్రస్తావించారు. ఈ మేరకు తాలిబన్ అధికారి కూడా పాష్టో భాషలో ఎక్స్‌లో వరుస పోస్ట్‌లను పంచుకున్నారు. ఇందులో ఇద్దరు మంత్రుల మధ్య చర్చించిన విషయాలు ప్రస్తావించారు.
Good conversation with Acting Afghan Foreign Minister Mawlawi Amir Khan Muttaqi this evening.
Deeply appreciate his condemnation of the Pahalgam terrorist attack.
Welcomed his firm rejection of recent attempts to create distrust between India and Afghanistan through false and…
— Dr. S. Jaishankar (@DrSJaishankar) May 15, 2025
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య దాదాపు అన్ని వాణిజ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఈ క్రమంలో చాబహార్ నౌకాశ్రయం ప్రాముఖ్యతను సంతరించుకుంది. భూపరివేష్టిత దేశంగా ఆఫ్ఘనిస్తాన్-భారత్ చేరుకోవడానికి పాకిస్తాన్ భూ మార్గాలపై ఆధారపడ్డాయి. భారత్, ఆఫ్ఘనిస్తాన్ కూడా ఈ భూ సరిహద్దును పంచుకునేవి. కానీ అది 1947 నుంచి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పిఓకె)లోకి వెళ్లడంతో ఆ దారి మూసుకుపోయింది. దీంతో నాటి నుంచి వాణిజ్య కార్యకలాపాలు ఇరాన్‌లోని చాబహార్ నౌకాశ్రయం ద్వారా మాత్రమే జరుగుతున్నాయి.
తాలిబన్లతో భారత్ స్నేహం నిజమేనా..?
2021లో ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత్.. తాలిబాన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తిచనప్పటికీ.. ఈ రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నాయి. అయితే ఈ సంబంధాలు ఇంకా సాధారణ స్థితికి చేరుకోనప్పటికీ తాలిబాన్ పాలనలో ఆఫ్ఘనిస్తాన్ పట్ల భారత్ విధానం మానవతా సహాయం అందించడం, ఆఫ్ఘన్ పౌరుల శ్రేయస్సుపై దృష్టి కేంద్రీకరించింది. సంబంధాలలో సాధారణ స్థితిని తీసుకురావడానికి దౌత్యపరమైన కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 27న పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగిన కొన్ని రోజుల తర్వాత, భారత సీనియర్ దౌత్యవేత్త ఆనంద్ ప్రకాష్ కాబూల్‌ను సందర్శించారు. ఆ సమయంలో సరిహద్దు ఉగ్రవాద సంబంధాలపై న్యూఢిల్లీ, ఇస్లామాబాద్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ పర్యటన సందర్భంగా ప్రకాష్ – ముత్తాకితో సమావేశం నిర్వహించారు.
د هېواد د بهرنیو چارو وزير هند د سیمې مهم هیواد او له افغانستان سره يې اړیکې تاريخي وبللې او هیله يې څرگنده کړه چې دا ړیکې لا پیاوړې شي. د بهرنيو چارو وزير د متوازن سياست په خپلولو سره ټولو لوريو سره پر مثبتو اړيکو ټينگار وکړ. مولوي امير خان متقي همداراز افغان سوداگرو…
— Hafiz Zia Ahmad (@HafizZiaAhmad) May 15, 2025
د ا.ا.ا. د بهرنیو چارو وزیر محترم مولوي امیر خان متقي او د هند جمهوریت د بهرنیو چارو وزیر ښاغلي جې شنکر ټيلیفوني خبرې وکړې. په دې مکالمه کې د دوو اړخیزو اړیکو پر پیاوړتیا، تجارت او د دیپلوماتیکو اړیکو د کچې پر لوړولو خبرې وشوې. pic.twitter.com/weErRrvARu
— Hafiz Zia Ahmad (@HafizZiaAhmad) May 15, 2025
భారత్ సీనియర్ దౌత్యవేత్తల సందర్శనలలో భాగంగా జేపీ సింగ్ గత రెండేళ్లలో రెండుసార్లు ఆఫ్ఘనిస్తాన్‌ను సందర్శించారు. మార్చిలో తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకిని కలవడానికి, నవంబర్‌లో తాత్కాలిక రక్షణ మంత్రి మహ్మద్ యాకుబ్ ముజాహిద్‌ను కలవడానికి.. ఇలా రెండు సమావేశాలు కాబూల్‌లో జరిగాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో జరిగిన సమావేశాలతో పాటు, ఈ ఏడాది జనవరిలో దుబాయ్‌లో ఉన్నత స్థాయి సమావేశం కూడా జరిగింది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, భారత ప్రతినిధి బృందంతో కలిసి తాలిబాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి, ఆఫ్ఘన్ ప్రతినిధి బృందాన్ని కలిశారు. ఇద్దరు నాయకులు చాబహార్ నౌకాశ్రయంతో సహా పలు అంశాలపై విస్తృత ద్వైపాక్షిక చర్చలు జరిపారు. దుబాయ్‌లో జరిగిన ఈ సమావేశం.. మానవతా సహాయం, అభివృద్ధి సహాయం, వాణిజ్యం, వాణిజ్యం, క్రీడలు, సాంస్కృతిక సంబంధాలు, ప్రాంతీయ భద్రత, జాతీయ ప్రయోజనాల ప్రాజెక్టులపై సహకారాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా జరిగింది. మరోవైపు అఫ్గాన్‌లో కూడా అల్‌ఖైదా, ఐసిస్, తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్థాన్ వంటి ఉగ్రముఠాలను పెంచి పోషిస్తుంది. ఈ విషయంలో భారత్‌లో కొంత ఆందోళన ఉంది. ఈ నేపథ్యంలో తాలిబన్ మంత్రితో జైశంకర్ తాజాగా చర్చలు జరపడం ప్రాముఖ్యతను సంతరించుకుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




