పాల కల్తీకి పేపర్‌తో చెక్ ..
ప్రస్తుతం అన్నిట నకిలీ వ్యవస్థ రాజ్యమేలుతోంది. ఇందు లేదందూ లేదన్నట్లుగా పసిపిల్లలు తాగే పాల దగ్గర్నుంచి.. రోగం వస్తే తీసుకునే మందుల వరకు కల్తీ చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. గత కొంతకాలంగా పాల కల్తీ వ్యాపారం జోరుగా సాగుతోంది. ధనార్జనే ధ్యేయంగా అక్రమార్కులు విచ్చలవిడిగా కల్తీపాలను తయారు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. నాణ్యతలేని పాలతో ప్రజలు కూడా అనారోగ్యల పాలవుతున్నారు. అసలు పాల నాణ్యతను ఏలా కనిపెట్టాలో తెలియక అందుబాటులో ఉన్న పాలనే స్వచ్ఛమైనవిగా భావించి తాగేస్తున్నారు. […]
ప్రస్తుతం అన్నిట నకిలీ వ్యవస్థ రాజ్యమేలుతోంది. ఇందు లేదందూ లేదన్నట్లుగా పసిపిల్లలు తాగే పాల దగ్గర్నుంచి.. రోగం వస్తే తీసుకునే మందుల వరకు కల్తీ చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. గత కొంతకాలంగా పాల కల్తీ వ్యాపారం జోరుగా సాగుతోంది. ధనార్జనే ధ్యేయంగా అక్రమార్కులు విచ్చలవిడిగా కల్తీపాలను తయారు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. నాణ్యతలేని పాలతో ప్రజలు కూడా అనారోగ్యల పాలవుతున్నారు. అసలు పాల నాణ్యతను ఏలా కనిపెట్టాలో తెలియక అందుబాటులో ఉన్న పాలనే స్వచ్ఛమైనవిగా భావించి తాగేస్తున్నారు. అయితే, పాల కల్తీని క్షణాల్లోనే కనిపెట్టేందుకు ఓ సులువైన మార్గాన్ని కనిపెట్టారు ఐఐటీ శాస్త్రజ్ఞులు. సాధారణంగా పాలలో సూక్ష్మ జీవుల ఉనికి, వాటిస్థాయిని బట్టటి పాల నాణ్యత, తాజాదనాన్ని తెలుసుకుంటారు. ఇందుకు ప్రస్తుతం మెథలీన్ బ్లూ తదితర పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. అయితే, వీటిని ప్రయోగశాలల్లో నిపుణులు మాత్రమే చేస్తుంటారు. రిజల్ట్ రావటానికి గంటల కొద్దీ సమయం పడుతుంది. అలా కాకుండా సామాన్యులు సైతం తక్షణమే పాల నాణ్యత, తాజాదనాన్ని తెలుసుకునే విధంగా “పేపర్ సెన్సర్’ను కనిపెట్టారు ఐఐటీ – గుహవాటి సైటిస్టులు.
పాల కల్తీని అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రంజల్ చంద్ర, కుల్దీప్ బృందం సామాన్య ప్రజలు కూడా పాల నాణ్యతను తెలుసుకునే సరికొత్త కాగితం సెన్సర్‌ను రూపొందించింది. పశువుల నుంచి సేకరించిన పాలలో ఆల్కలైన్ ఫాస్పేట్ అనే ప్రొటీన్ ఉంటుంది. ఇది పాల నాణ్యతపై ప్రభావం చూపుతోంది. పాలను మరిగించినప్పుడు ఇది పోతుంది. పాలను పరీక్షించినప్పుడు ఆల్కలైన్ ఉందని తేలితే పాలను సరిగా మరిగించలేదని, నాణ్యత దెబ్బతిందని అర్థం. దీనిని దృష్టిలో పెట్టుకుని ఐఐటీ-గవాహటి శాస్త్రవేత్తలు యాంటీ-ఏఎల్‌పీ రసాయనాలతో ప్రత్యేక కాగితాన్ని తయారుచేశారు. ఈ సందర్భంగా పరిశోధకులు మాట్లాడుతూ..’ఆల్కలైన్ ఫాస్పేట్ ఉన్న పాలలో మేం తయారుచేసిన కాగితాన్ని ఉంచితే… కొద్దిసేపటికి నీలం-ఆకుపచ్చ రంగుల్లోకి మారుతుంది. కాగితం ఎంత ముదురు రంగుల్లోకి మారితే పాలు అంతగా కలుషితమైనట్టు. ఒకవేళ పాలలో ఏఎల్‌పీ లేకపోతే కాగితం సెన్సర్ రంగు మారదు.’ అని తెలిపారు.