Supreme Court: పిల్లలు ఉదయం 7 గం.లకే స్కూల్స్‌కు వెళ్తుంటే.. జడ్జీలు, లాయర్లు ఉదయం గం.9 లకు ఎందుకు కోర్టుకు రాలేరంటూ ప్రశ్న

| Edited By: Venkata Chari

Jul 15, 2022 | 6:56 PM

సుప్రీంకోర్టు సాధారణ పని సమయం కంటే ఒక గంట ముందుగానే న్యాయమూర్తులు లలిత్, ఎస్ రవీంద్ర భట్ , సుధాన్షు ధులియాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉదయం 9.30 గంటలకు పనిని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో జస్టిస్ లలిత్ పని మొదలు పెట్టె సమయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు,

Supreme Court: పిల్లలు ఉదయం 7  గం.లకే స్కూల్స్‌కు వెళ్తుంటే.. జడ్జీలు, లాయర్లు ఉదయం గం.9 లకు ఎందుకు కోర్టుకు రాలేరంటూ ప్రశ్న
Supreme Court Judge
Follow us on

Supreme Court judge: కొంతమంది ఉద్యోగుల కంటే.. విద్యార్థుల జీవితం రోజులో ముందు మొదలవుతుంది. ఉదయమే నిద్రలేచి ఏడుగంటలకు పాఠశాలలకు వెళ్ళడానికి చకచకా రెడీ అయ్యి.. చదువుకోవడానికి బడికి పయనమవుతారు. ఇదే విషయాన్నీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రస్తావిస్తూ.. సరికొత్త ప్రశ్నను లేవనెత్తారు.. అదే సాయంలో ఓ కేసు విషయమై.. కోర్టు సమయం కంటే ముందుగానే కోర్టుకి వచ్చిన బెంచ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. అవును కోర్టు సాక్షిగా పిల్లలు ఉదయం ఏడు గంటలకు పాఠశాలకు వెళ్తున్నారు. మరి న్యాయమూర్తులు, న్యాయవాదులు తమ రోజును ఉదయం 9 గంటలకు ఎందుకు ప్రారంభించలేకపోతున్నారని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ శుక్రవారం వ్యాఖ్యానించారు.

న్యాయమూర్తులు లలిత్, ఎస్ రవీంద్ర భట్, సుధాన్షు ధులియాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉదయం 9.30 గంటలకు సుప్రీంకోర్టు సాధారణ పని సమయం కంటే గంట ముందుగా పని ప్రారంభించింది. ఒక బెయిల్ కేసు విషయంలో కోర్టు సమయం కంటే ముందు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ కోర్టుకు హాజరయ్యారు. కోర్టు సాధారణ పని సమయం కంటే ముందుగానే వచ్చినందుకు బెంచ్‌ను జస్టిస్ లలిత్ ప్రశంసించారు. అనంతరం జస్టిస్ లలిత్ మాట్లాడుతూ, “నా దృష్టిలో అందరికి ఆదర్శంగా మనం ఉదయం 9 గంటలకే కోర్టుకు హాజరుకావాలి. పిల్లలు ఉదయం 7 గంటలకు పాఠశాలకు వెళ్తున్నప్పుడు మనం ఎందుకు ఉదయం గం. 9లకు రాలేమని అన్నారు.  కోర్టు తన పనిని రోజులో త్వరగా ప్రారంభిస్తే.. ఆ రోజు పనిని త్వరగా పూర్తి చేయవచ్చనని అన్నారు. అంతేకాదు ఇలా చేయడం వలన నెక్స్ట్ డే కోర్టు ముందుకు వచ్చే కేసు ఫైళ్లను చదవడానికి న్యాయమూర్తులు సాయంత్రం ఎక్కువ సమయం లభిస్తుందని జస్టిస్ లలిత్ అన్నారు.

“కోర్టులు ఉదయం 9 గంటలకు తమ పనిని ప్రారంభించి, 11.30 గంటలకు అరగంట విరామం తీసుకుని.. మధ్యాహ్నం 2 గంటలలోపు రోజు పనిని ముగించవచ్చని అన్నారు. ఇలా చేయడంవలన న్యాయమూర్తులు సాయంత్రం మరిన్ని కేసులకు సంబంధించిన ఫైళ్లను రివ్యూ చేయడానికి ఎక్కువ సమయం దొరుకుతుందని చెప్పారు. అయితే ఈ విధానం.. సుదీర్ఘ విచారణలు అవసరం లేని కేసులు ఉన్నప్పుడు మాత్రమే వర్కౌట్ అవుతుందన్నారు.

ఇవి కూడా చదవండి

ఆగస్టు నెలాఖరు ఇలా కోర్టుకు ముందే హాజరయ్యే అవకాశం మరింత పెరుగుతుందని రోహత్గీ చెప్పారు. దేనికి జస్టిస్ లలిత్ స్పందిస్తూ.. ‘‘ఇది కేవలం వ్యూ మాత్రమే నని.. పేర్కొన్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఆగస్టు 26న పదవీ విరమణ చేయనున్నారు. అనంతరం సుప్రీ కోర్టు జడ్జిగా జస్టిస్ లలిత్ బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ సంవత్సరం నవంబర్ 8 వరకు ఆ పదవిలో పనిచేయనున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..