AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫోన్లు, కరెన్సీని శానిటైజ్ చేసే డివైజ్ వచ్ఛేసింది…

హైదరాబాద్ లోని డీఆర్ డీ ఓ ల్యాబ్ సరికొత్త డివైజ్ ని అభివృధ్ది చేసింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ అల్ట్రా వయొలెట్ శానిటైజర్ అని వ్యవహరించే ఈ కాంటాక్ట్ లెస్ శానిటైజర్ కాబినెట్..

ఫోన్లు, కరెన్సీని శానిటైజ్ చేసే డివైజ్ వచ్ఛేసింది...
Umakanth Rao
| Edited By: |

Updated on: May 11, 2020 | 11:10 AM

Share

హైదరాబాద్ లోని డీఆర్ డీ ఓ ల్యాబ్ సరికొత్త డివైజ్ ని అభివృధ్ది చేసింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ అల్ట్రా వయొలెట్ శానిటైజర్ అని వ్యవహరించే ఈ కాంటాక్ట్ లెస్ శానిటైజర్ కాబినెట్.. మొబైల్ ఫోన్లు, ఐ-ప్యాడ్లు, పాస్ బుక్స్, చాలాన్స్, లాప్ టాప్స్, కరెన్సీ నోట్లు తదితరాలను శానిటైజ్ చేస్తుందని ఈ సంస్థ ట్వీట్ చేసింది. ఓపెనింగ్, క్లోజింగ్ డ్రాయర్ తో  కూడిన ప్రాక్జిమిటీ సెన్సర్ల వల్ల ఆటోమాటిక్ గా దీన్ని ఆపరేట్ చేయవచ్చు. కాబినెట్ లో ఉంచే వస్తువులను 360 డిగ్రీల అల్ట్రా వయొలెట్ వ్యవస్థతో శానిటైజ్ చేయవచ్చునని ఈ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. వస్తువులు ఒకసారి శానిటైజ్ అయ్యాక.. సిస్టం ‘స్లీప్ మూడ్’ లోకి వెళ్ళిపోతుందని వారు చెప్పారు. తాము ఆటోమేటెడ్ యువీసీ కరెన్సీ శానిటైజర్ డివైజ్ (నోట్స్ క్లీన్) అనే సాధనాన్ని కూడా డెవలప్ చేశామన్నారు.