
క్షణికావేశంలో కొంత మంది దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా.. ఓ మహిళ భర్త బ్యూటీ పార్లర్‌కు వెళ్లొద్దానడన్న కారణంతో బలవన్మరణానికి పాల్పడింది. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటుచేసుకుంది. ఇండోర్‌లోని ఓ వివాహిత బ్యూటీ పార్లర్‌కు వెళ్లకుండా భర్త అడ్డుకున్నాడన్న కారణంతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రీనా యాదవ్ (34) అనే బాధితురాలు గురువారం నగరంలోని స్కీమ్ నంబర్ 51 ప్రాంతంలోని తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని సబ్ ఇన్‌స్పెక్టర్ ఉమాశంకర్ యాదవ్ తెలిపారు.
ఆమెను బ్యూటీపార్లర్‌కు వెళ్లకుండా అడ్డుకున్నాడని, ఆవేశంతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయిందని ఆమె భర్త ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ వెల్లడించారు. పోస్ట్‌మార్టం నిర్వహించి ఈ కేసును అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నామని యాదవ్ తెలిపారు.
ఘటన అనంతరం ఆమె భర్త బలరాం పోలీసులకు సమాచారం అందించగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పెళ్లయి 15 ఏళ్లయినా బలరాం, రీనా మధ్య నిత్యం గొడవలు జరుగుతున్నాయని మహిళ కుటుంబ సభ్యులు ఆరోపించారు.
బలరాం యాదవ్, రీనా దంపతులు ఏరోడ్రమ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నారని.. భర్త బ్యూటీపార్లర్‌కు వెళ్లొద్దని చెప్పిన తర్వాత ఆమె తీవ్ర మనోవేదనకు గురై ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఫ్యాన్ కు వేలాడుతున్న భార్యను చూసి భర్త కన్నీరుమున్నీరుగా విలపించాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..