నైకూను పట్టించిన ‘మేకు’.. ఆ ఆఫీసర్ అలా వెళ్లడం వల్లనే..!

రెండు రోజుల క్రితం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మోస్ట్ వాంటెండ్‌ టెర్రరిస్ట్‌, హిబ్జుల్ కమాండర్‌ రియాజ్‌ అహ్మద్‌ నైకూను భారత సైనిక దళాలు తుదముట్టించిన విషయం తెలిసిందే

నైకూను పట్టించిన 'మేకు'.. ఆ ఆఫీసర్ అలా వెళ్లడం వల్లనే..!
Follow us

| Edited By:

Updated on: May 08, 2020 | 5:13 PM

రెండు రోజుల క్రితం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మోస్ట్ వాంటెండ్‌ టెర్రరిస్ట్‌, హిబ్జుల్ కమాండర్‌ రియాజ్‌ అహ్మద్‌ నైకూను భారత సైనిక దళాలు తుదముట్టించిన విషయం తెలిసిందే. దక్షిణ కశ్మీర్‌ బైగ్‌పోరాలో ఓ ఇంట్లో అతడు నక్కి ఉన్నాడన్న సమాచారం మేరకు.. కూంబింగ్ నిర్వహించిన పోలీసులు, భద్రతా బలగాలు ఎట్టకేలకు గుర్తించి చంపేశాయి. ఇక పోలీసు వర్గాల వివరాల ప్రకారం.. ఫేక్ సీలింగ్ అతడిని పట్టించినట్లు సమాచారం.

దీనిపై ఓ ఆఫీసర్‌ మాట్లాడుతూ.. ”నైకూ కోసం ఎప్పటినుంచో వెతుకుతున్నాం. దక్షిణ కశ్మీర్‌లో అతడు దాక్కొని ఉన్నాడన్న సమాచారంతో మే5 ఆపరేషన్ ప్రారంభించాం. ఈ క్రమంలో బైగ్‌పోరాలో మొదట రెండు ఇళ్లను వెతికాం. అక్కడ మాకు ఏం కనిపించలేదు. ఆ తరువాత అండర్‌గ్రౌండ్‌లో అతడు దాక్కొని ఉండొచ్చని భావించాం. దీంతో ఫోకస్ మార్చి మూడో ఇంట్లో అనువణువు మూడు సార్లు సోదించాం. కానీ ఆ ఉగ్రవాది జాడ కనిపించలేదు. ఇక చివరగా ఓ పోలీస్‌ ఆఫీసర్‌ లోపలికి వెళ్లగా.. అక్కడ ఓ షీలింగ్ సీట్‌కు కొత్త మేకు ఉండటాన్ని అతడు గమనించారు. దీంతో అనుమానం వచ్చి దానిపైన కొట్టగా లోపలి నుంచి ఫైరింగ్ ప్రారంభమైంది. ఆ తరువాత అప్రమత్తమైన భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో నైకూను అంతమొందించాం” అని తెలిపారు. కాగా ఈ కాల్పుల్లో నైకూ సహచరుడు అదిల్‌ అహ్మద్‌ను సైతం భద్రతా బలగాలు తుదముట్టించాయి. బుధవారం సోనమార్గ్‌లో ఆ ఉగ్రవాదుల అంత్యక్రియలు జరిగాయి.

Read This Story Also: నెగిటివ్‌ వస్తేనే వలస కార్మికులను రాష్ట్రంలోకి రానివ్వండి: హైకోర్టు