క్వారంటైన్ సెంటర్ నుంచి.. 22మంది వలస కార్మికులు పరార్..
కోవిద్-19 ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. అయితే.. తెలుగు రాష్ట్రాల నుంచి ఇటీవల ఛత్తీస్‌ఘడ్ చేరుకున్న వలస కార్మికుల్లో దాదాపు 20 మందికి పైగా క్వారంటైన్ సెంటర్ నుంచి
Escape from quarantine centre: కోవిద్-19 ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. అయితే.. తెలుగు రాష్ట్రాల నుంచి ఇటీవల ఛత్తీస్‌ఘడ్ చేరుకున్న వలస కార్మికుల్లో దాదాపు 20 మందికి పైగా క్వారంటైన్ సెంటర్ నుంచి పారిపోయినట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన దంతేవాడ జిల్లాలోని బస్రత్ ప్రాంతంలో వారిని ఉంచామని, అయితే అధికారులు లేని సమయంలో చూసుకుని వారు పారిపోయి ఉంటారని తెలిపారు.
వివరాల్లోకెళితే.. దంతేవాడ జిల్లా కలెక్టర్ తోపేశ్వర్ వర్మ మాట్లాడుతూ.. ‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి దాదాపు 47 మంది వలస కార్మికులు గురువారం ఛత్తీస్‌ఘర్ చేరుకున్నారు. వారందరినీ వైద్య సిబ్బంది పరీక్షించిన తరువాత దగ్గరలోని పోలీస్ స్టేషన్‌లో క్వారంటైన్ చేశాం. వారంతా స్థానిక నహాది గ్రామానికి చెందిన వారు. గురువారం రాత్రి వారిలో 22 మంది తప్పించుకుని పారిపోయార’ని తెలిపారు.
కాగా.. పారిపోయినవారిలో ఎవరికీ కోవిద్-19 లక్షణాలు లేవని, వారి గ్రామ సర్పంచ్‌కు, సెక్రటరీకి విషయాన్ని తెలియజేశామని, వారు గ్రామానికి చేరుకోగానే తమకు తెలియపరచాలని ఆదేశించామని వెల్లడించారు. కాగా ఆ ప్రాంతమంతా పూర్తిగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతమని, ఆ ప్రాంతంలోకి వెళ్లడం అధికారులకు అంత సులభం కాదని కలెక్టర్ తోపేశ్వర్ చెప్పుకొచ్చారు.