AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యధాప్రకారం…జులైలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు… ప్రభుత్వ ఆశాభావం…

వచ్చే జులై నెలలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు యధాప్రకారం జరుగుతాయని ఆశిస్తున్నామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ తెలిపారు. దేశంలో సెకండ్ కోవిద్ వేవ్ ఇంకా దాదాపు బలంగానే ఉన్న తరుణంలో ఈ సమావేశాలు...

యధాప్రకారం...జులైలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు... ప్రభుత్వ ఆశాభావం...
Hopeful Of Monsoon Session Of Parliament Says Minister Prahlad Joshi
Umakanth Rao
| Edited By: Anil kumar poka|

Updated on: Jun 08, 2021 | 6:31 PM

Share

వచ్చే జులై నెలలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు యధాప్రకారం జరుగుతాయని ఆశిస్తున్నామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ తెలిపారు. దేశంలో సెకండ్ కోవిద్ వేవ్ ఇంకా దాదాపు బలంగానే ఉన్న తరుణంలో ఈ సమావేశాలు జరుగుతాయా అన్న సందేహాలు తలెత్తిన నేపథ్యంలో ఆయన ఈ విషయం చెబుతూ..పాండమిక్ ప్రారంభమైనప్పటి నుంచి పార్లమెంట్ సెషన్స్ ని కుదించిన సంగతి తెలిసిందేనన్నారు. పైగా గత ఏడాది శీతాకాల సమావేశాలను ఏకంగా రద్దు చేయాల్సి వచ్చిందన్నారు. గత సంవత్సరం జులైలో జరగాల్సిన వర్షాకాల సమావేశాలు సెప్టెంబరులో జరిగాయి. ఇదంతా కోవిద్ పాండమిక్ కారణంగానే అని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఇక ఈ ఏడాది జులైలో జరగవలసిన సెషన్స్ కి సంబంధించిన విధివిధానాలపై ఇంకా చర్చిస్తున్నట్టు ఈ వర్గాలు వెల్లడించాయి. ఏమైనా నార్మల్ గా వచ్చే నెల యధాప్రకారం ఈ సెషన్ జరుగుతుందనే ఆశిస్తున్నాను అని ప్రహ్లాద్ జోషీ వ్యాఖ్యానించారు. పార్లమెంట్ సభ్యుల్లో చాలామంది కనీసం ఒక డోసైనా కరోనా వ్యాక్సిన్ తీసుకున్నందున ఈ సారి సమావేశాలు సజావుగా జరుగుతాయని అధికారులు కూడా ఆశిస్తున్నారు.

గత సమావేశాల సందర్భంలో కీలక బిల్లులను ఉభయ సభలూ హడావుడిగా ఆమోదించాయి. కొన్ని బిల్లులను ప్రతిపక్షాలు లేకుండానే పార్లమెంట్ ఆమోదించింది. మరి ఈ సారి సెషన్ ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. థర్డ్ కోవిద్ వేవ్ ముప్పు ఉంటుందన్న వార్తల నేపథ్యంలో జులైలో జరగాల్సిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది.

మరిన్ని ఇక్కడ చూడండి: Y. S. Vivekananda Reddy : వివేకానంద హత్య కేసుపై సీబీఐ విచారణ పునఃప్రారంభం..కడపకు చేరుకున్న సీబీఐ అధికారులు

గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ సత్యాగ్రహ దీక్ష..కరోనాకు ఉచితంగా చికిత్స చెయ్యాలి అంటూ డిమాండ్ :Telangana Congress video.

 భూమిపై దర్శనమిచ్చిన భారీ స్విమ్మింగ్ ఫూల్ ..!చూస్తుండగానే అంతకంతకు పెద్దదిగా మారుతుంది..:viral vieo.

నాట్యం చేస్తున్న నెమలి చుస్తే వావ్ అనాల్సిందే..వైరల్ అవుతున్న వీడియో : Peacock viral video