AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amit Shah: ఆ రాష్ట్రంలో మళ్లీ బీజేపీ గెలుస్తుంది.. సీట్లు ఎన్నివస్తాయో కూడా చెప్పిన అమిత్ షా..

మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప తమ పార్టీ స్టార్ క్యాంపెయినర్ అని తేల్చి చెప్పారు. దక్షిణాది రాష్ట్రమైన కర్నాటకలో వరుసగా రెండవ సారి అధికారం చేజిక్కుంచుకోవడంతో పాటుగా ప్రభుత్వం ఏర్పాటుచేస్తామనే విశ్వాసం ఉందని ఆయన వెల్లడించారు.

Amit Shah: ఆ రాష్ట్రంలో మళ్లీ బీజేపీ గెలుస్తుంది.. సీట్లు ఎన్నివస్తాయో కూడా చెప్పిన అమిత్ షా..
Home Minister Amit Shah
Sanjay Kasula
|

Updated on: Mar 30, 2023 | 8:51 PM

Share

కర్ణాటకలో మళ్లీ భారీ మెజారిటీతో భారతీయ జనతా పార్టీ( బీజేపీ) తిరిగి అధికారంలోకి వస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. బుధవారం రైజింగ్ ఇండియా సమ్మిట్‌లో అమిత్ షా మాట్లాడుతూ.. మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప తమ పార్టీ స్టార్ క్యాంపెయినర్ అని తేల్చి చెప్పారు. దక్షిణాది రాష్ట్రమైన కర్నాటకలో వరుసగా రెండవ సారి అధికారం చేజిక్కుంచుకోవడంతో పాటుగా ప్రభుత్వం ఏర్పాటుచేస్తామనే విశ్వాసం ఉందని ఆయన వెల్లడించారు. కర్నాటకలో ఎన్నికలకు ముందు లేదా తరువాత ఎలాంటి భాగస్వామ్యాలనూ బీజెపీ చేసుకోదని విస్పష్టంగా ఈ మాస్టర్‌ ప్లాన్ ఎంటో ప్రకటించారు.

కర్నాటకలో తాను తొమ్మిది రోజులు గడిపాను.. ఈ రాష్ట్రంలో ఐదు ప్రాంతాలనూ సందర్శించాను. ఈ సందర్శనలో సమయంలో తాను గమనించిన విషయాలను మీడియాతో పంచుకున్నారు. రాష్ట్రంలో పూర్తి మెజారిటీ సాధించగలమని అన్నారు. ఇది మోదీ నాయకత్వంలో జరిగి తీరుతుంది. ఎలాంటి ఆందోళన చెందవసరం లేదన్నారు అని అమిత్ షా.

జెడీఎస్‌తో ఎలాంటి పొత్తులూ ఉండవని తేల్చి చెప్పిన షా.. కర్నాటకలో 224 సీట్లకూ బీజెపీ సొంతంగా పోటీ పడుతుందని.. ఎలాంటి పొత్తులనూ ఏ పార్టీతోనూ రాష్ట్రంలో పెట్టుకోదన్నారు. గత ఎన్నికలలో సాధించిన 104 సీట్ల మార్కును మరింత మెరుగుపరుచుకోగలమనే నమ్మకంతో ఉన్నామన్నారు.

ఎలాంటి భాగస్వామ్యాలనూ , ఏ పార్టీతోనూ చేసుకోంటూ తేల్చి చెప్పారు. లక్షలాది మంది కార్యకర్తలతో చర్చించిన పిమ్మట పార్టీ తమ అభ్యర్థుల జాబితా విడుదల చేస్తుందని షా వెల్లడించారు. కాంగ్రెస్‌, జెడీఎస్‌లు ఇప్పటికే తమ తొలి జాబితా అభ్యర్ధుల పేర్లను వెల్లడించాయి.

అయితే పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి ఎవరనే దానిపై అమిత్ షా క్లారిటీ ఇవ్వలేదు. ఎన్నికైన ఎమ్మెల్యేలే ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారని తెలిపారు. మే 10న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో తమ అవకాశాలను పెంచుకునేందుకు బీజేపీ దృష్టి సారిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం