Kangana Ranaut: కంగనా రనౌత్‌కు షాక్.. నోటీసులు ఇచ్చిన హైకోర్టు.. వివరణ ఇవ్వాల్సిందే..
మండిలో కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాధిత్య సింగ్ ను భాజపా తరుపున పోటీ చేసిన కంగనా 74,755 ఓట్లతో ఓడించారు. అదే ఎన్నికలలో పోటీ చేయడానికి తాను దాఖలు చేసిన నామపత్రాలను తప్పుడు కారణాలతో తిరస్కరించారని పేర్కొంటూ లాయక్ రామ్ నేగి కోర్డులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే కంగనా రనౌత్ ఎన్నికను కూడా పక్కన పెట్టాలని విజ్ఞప్తి చేశారు.
బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ అభ్యర్థిత్వం ప్రమాదంలో పడింది. హిమాచల్‌లోని మండి నియోజకవర్గం నుంచి తొలిసారిగా లోక్‌సభకు ఎంపీగా గెలిచిన కంగనాకు బుధవారం హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు తాను దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను అన్యాయంగా తిరస్కరించారంటూ కిన్నౌర్ వాసి పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాకుండా కంగనా ఎంపీ పదవిని రద్దు చేయాలని కూడా పిటిషన్‌లో డిమాండ్ చేశారు. ఈ పిటిషన్ ఆధారంగా కంగనాకు హైకోర్టు నోటీసులు జారీ చేస్తూ ఆగస్ట్ 21లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మండిలో కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాధిత్య సింగ్ ను భాజపా తరుపున పోటీ చేసిన కంగనా 74,755 ఓట్లతో ఓడించారు. అదే ఎన్నికలలో పోటీ చేయడానికి తాను దాఖలు చేసిన నామపత్రాలను తప్పుడు కారణాలతో తిరస్కరించారని పేర్కొంటూ లాయక్ రామ్ నేగి కోర్డులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే కంగనా రనౌత్ ఎన్నికను కూడా పక్కన పెట్టాలని విజ్ఞప్తి చేశారు.
రామ్ నేగి మాజీ అటవీ శాఖ ఉద్యోగి. ఎన్నికలలో పోటీ చేసేందుకు తాను ముందస్తుగానే ఉద్యోగవిరమణ చేసినట్లు అతడు తన పిటిషన్ లో పేర్కొన్నాడు. నామినేషన్ పత్రాలతోపాటే డిపార్ట్మెంట్ నుంచి పొందిన నో డ్యూ సర్టిఫికెట్ కూడా జతచేసినట్లు తెలిపారు. కానీ విద్యుత్తు, తాగునీరు, టెలిఫోన్ విభాగాల నుంచి కూడా సర్టిఫికెట్స్ తీసుకురావాలని రిటర్నింగ్ అధికారి ఆదేశించారని.. అందుకు ఇచ్చిన ఒకరోజు గడువులోనూ తాను అన్నీ సర్టిఫికెట్స్ తీసుకెళ్లినప్పటికీ తన నామినేషన్ తిరస్కరించారని అన్నారు.
నామపత్రాలు అంగీకరించి ఉంటే తాను అక్కడి నుంచి గెలిచేవాడినని.. అందుకే కంగనా ఎన్నికను పక్కన పెట్టాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు రామ్ నేగి. కంగనా ఎంపీ పదవిని రద్దు చేసి మళ్లీ మండి ఎన్నికలు నిర్వహించాలని నేగి కోర్టును ఆశ్రయించారు. నేగి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ జ్యోత్స్నా రేవాల్ కంగనాకు నోటీసు పంపి ఆగస్టు 21లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.