Himachal Pradesh: మంచుకొండల్లో హస్తం పార్టీకి కొత్త ఊపిరి.. హిమాచల్‌లో విజయం దిశగా కాంగ్రెస్..

మంచుకొండల్లో కాంగ్రెస్‌కు కొత్త ఊపిరి వచ్చింది. హిమాచల్‌ ప్రదేశ్‌లో జరిగిన హోరాహోరీ ఫైట్‌లో కాంగ్రెస్‌ ఒక్కసారిగా దూసుకెళ్లింది. మేజిక్‌ ఫిగర్‌ని దాటింది.

Himachal Pradesh: మంచుకొండల్లో హస్తం పార్టీకి కొత్త ఊపిరి.. హిమాచల్‌లో విజయం దిశగా కాంగ్రెస్..
Congress

Updated on: Dec 08, 2022 | 3:32 PM

Himachal Pradesh Election Result 2022: మంచుకొండల్లో కాంగ్రెస్‌కు కొత్త ఊపిరి వచ్చింది. హిమాచల్‌ ప్రదేశ్‌లో జరిగిన హోరాహోరీ ఫైట్‌లో కాంగ్రెస్‌ ఒక్కసారిగా దూసుకెళ్లింది. మేజిక్‌ ఫిగర్‌ని దాటింది. బీజేపీ – కాంగ్రెస్ మధ్య కొనసాగిన హోరాహోరి పోరులో హస్తం పార్టీ విజయం సాధించింది. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్న కాంగ్రెస్‌కు హిమాచల్‌లో గెలుపుతో ఊరట దక్కినట్లయింది. హిమాచల్‌ ప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 68 సీట్లుండగా.. మ్యాజిక్‌ ఫిగర్‌కు కావాల్సిన 35 సీట్లను కాంగ్రెస్‌ దాటేసింది. ఇప్పటివరకు కాంగ్రెస్‌ 36 సీట్లు సాధించింది. నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 23 స్థానాల్లో విజయం సాధించి రెండు సీట్లలో ఆధిక్యంలో ఉంది. ఇతరులు మూడు స్థానాల్లో గెలిచారు. కాగా.. ఓటమిని స్వీకరిస్తునట్టు బీజేపీ నేత, హిమాచల్‌ సీఎం జైరాం ఠాకూర్‌ వెల్లడించారు.

హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ పూర్తి ఆధిక్యంలో ఉండటంతో ఆపార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. అయితే, కాంగ్రెస్ 40కి పైగా సీట్లలో విజయం సాధించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేతలు అలర్ట్ అయ్యారు. గెలిచిన అభ్యర్థులను చండీగఢ్‌కు తరలించేందుకు సన్నాహాలు ప్రారంభించారు. అక్కడ గెలిచిన అభ్యర్థులతో సమావేశం అయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ నేతలు భూపిందర్ బఘేల్, భూపిందర్ హుడా, రాజీవ్ శుక్లా హిమాచల్ చేరుకోని పర్యవేక్షించనున్నారు. కాగా, హిమాచల్ లో పరిస్థితులపై ప్రియాంక గాంధీ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..