AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ప్రభుత్వ ఆస్పత్రిలోకి చేరిన వరద నీరు.. రోగుల తీవ్ర అవస్థలు

Tamil Nadu Rains: తమిళనాడులో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలకు ఆ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల్లో జలమయమయ్యాయి. రోడ్లపై వరదనీరు ఏరులై పారడంతో జనజీవనం స్తంభించింది.

Viral Video: ప్రభుత్వ ఆస్పత్రిలోకి చేరిన వరద నీరు.. రోగుల తీవ్ర అవస్థలు
Rain Water in Govt Hospital, Tamil Nadu
Janardhan Veluru
|

Updated on: Nov 29, 2021 | 3:49 PM

Share

Tamil Nadu Rains: తమిళనాడులో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలకు ఆ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల్లో జలమయమయ్యాయి. రోడ్లపై వరదనీరు ఏరులై పారడంతో జనజీవనం స్తంభించింది. భారీ వర్షాలు కురిసే అవకాశముందన్న భారత వాతావరణ శాఖ హెచ్చరికలతో తమిళనాడులోని 19 జిల్లాలో సోమవారంనాడు పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. ఆరు జిల్లాల్లో మాత్రం పాఠశాలలకు మాత్రం సెలవు ప్రకటించారు. పలుచోట్ల పాఠశాలలు, కాలేజీలు, పోలీస్ స్టేషన్లు, ఆస్పత్రుల్లోకి కూడా వర్షపు నీరు చేరాయి. చెన్నైతో పాటు నగర శివారు ప్రాంతాల్లో పలుచోట్ల రోడ్లపై వర్షపు నీరు చేరడంతో పలుచోట్ల వాహనాల రాకపోకలను దారిమళ్లించారు. వర్షపునీరు చేరడంతో కొన్ని సబ్‌వేలను తాత్కాలికంగా మూసివేశారు.

కాగా చెన్నై – తిరుత్తణి మార్గంలోని కనకమ్మ సత్రంలో వర్షపునీరు ప్రభుత్వ ఆస్పత్రికి చేరింది. వర్షపునీటిలో రోగులు, ఆస్పత్రి సిబ్బంది తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం స్టాలిన్ పర్యటన..

చెన్నైలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్.. వరద బాధితులను పరామర్శించారు. అక్కడ జరుగుతున్న సహాయక, పునరావాస ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తంచేస్తున్నారు.అటు పుదుచ్చేరిలోనూ సోమ, మంగళవారాల్లో పాఠశాలు, కాలేజీలకు సెలవు ప్రకటించారు.

Also Read..

Betting Mafia: తెలంగాణలో క్రికెట్ బెట్టింగ్ మాఫియా.. ఇద్దరు బుకీల అరెస్ట్.. రూ.2 కోట్లు స్వాధీనం

CM Jagan: చంద్రబాబువి బురద రాజకీయాలు.. టీడీపీ అధినేతపై CM జగన్ ఆగ్రహం..