Corona Waves: దేశంలో కరోనా కొత్త వేవ్ విజృంభణ.. ప్రజల ఆరోగ్య పరిస్థితిపై నిపుణులు ఏమన్నారంటే

కరోనా (Corona) విజృంభణ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవాళిని వణికిస్తోంది. తగ్గినట్లే తగ్గి మళ్లీ పుంజుకుంటున్న ఈ మహమ్మారి వ్యాప్తి పట్ల పలు దేశాలు అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలో కరోనా ముప్పు ఇంకా ముగిసిపోలేదని డబ్ల్యూహెచ్ఓ...

Corona Waves: దేశంలో కరోనా కొత్త వేవ్ విజృంభణ.. ప్రజల ఆరోగ్య పరిస్థితిపై నిపుణులు ఏమన్నారంటే
Follow us
Ganesh Mudavath

|

Updated on: Mar 21, 2022 | 6:26 AM

కరోనా (Corona) విజృంభణ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవాళిని వణికిస్తోంది. తగ్గినట్లే తగ్గి మళ్లీ పుంజుకుంటున్న ఈ మహమ్మారి వ్యాప్తి పట్ల పలు దేశాలు అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలో కరోనా ముప్పు ఇంకా ముగిసిపోలేదని డబ్ల్యూహెచ్ఓ (WHO) హెచ్చరికలు జారీ చేసింది. యూరప్, ఆసియాలోని పలు దేశాల్లో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. అయితే, మనదేశంలో భారీస్థాయిలో వ్యాక్సినేషన్‌ (Vaccination) పూర్తవడం, ఇప్పటికే చాలామంది వైరస్‌కు గురికావడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి.. కొత్త వేవ్‌ తీవ్ర ప్రభావం చూపించకపోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. దేశంలో కొత్త వేరియంట్‌ వచ్చినా ప్రభావం మాత్రం తక్కువగానే ఉండనున్నట్లు పేర్కొన్నారు. మూడు వేవ్‌ల తర్వాత యాంటీబాడీ స్థాయిలు తగ్గినప్పటికీ హైబ్రిడ్‌ ఇమ్యూనిటీ రక్షణ కల్పిస్తుంది. ఇదే సమయంలో మెజారిటీ ప్రజలకు మాస్క్‌ తప్పనిసరిగా అవసరం లేదని అభిప్రాయపడ్డారు.వృద్ధులు, ముప్పు ఎక్కువగా ఉన్నవారు మాత్రం మాస్క్‌ ధరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దేశంలో కొత్త వేరియంట్‌ల ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఇన్సాకాగ్‌కు నమూనాలను ఎప్పటికప్పుడు పంపించాలని కేంద్ర ఆరోగ్యశాఖ రాష్ట్రాలకు సూచించింది. వైరస్‌ విస్తృతిపై ఇటీవల ఉన్నత స్థాయి సమీక్ష జరిపిన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ.. జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ను విస్తృతంగా నిర్వహించాలని రాష్ట్రాలకు స్పష్టం చేశారు.

దేశంలో కొవిడ్‌ విస్తృతి తగ్గుతున్నప్పటికీ.. భవిష్యత్తులో వైరస్‌లో మ్యుటేషన్లు సంభవిస్తాయని చెప్పారు. ఇప్పటివరకు వెయ్యి మ్యుటేషన్లు జరిగినప్పటికీ వాటిలో కేవలం ఐదు మాత్రమే ఆందోళనకరమైనవని అన్నారు. వీటితోపాటు భవిష్యత్తులో కొత్త వేరియంట్‌లను పసిగట్టేందుకు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌తో పర్యవేక్షిస్తూనే ఉండాలన్నారు.దేశంలో ఇప్పటికే 80 నుంచి 90శాతం ప్రజలు వైరస్‌ బారినపడ్డారని.. కొత్తవేవ్‌ వచ్చినప్పటికీ తీవ్ర లక్షణాలు ఉండకపోవచ్చని నిపుణులు వెల్లడించారు. అయినప్పటికీ కొత్త వేరియంట్‌లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉన్నందున నిర్లక్ష్యం వహించకూడదని వివరించారు. విదేశాల్లో నమోదవుతున్న కరోనా మరణాల్లో ఎక్కువ భాగం వ్యాక్సిన్‌ తీసుకోనివేనని స్పష్టం చేశారు.

Also Read

Forest Bathing: జపనీయులు వారానికి ఒక్కసారైనా అడవి స్నానం చేస్తారట.. ఎందుకో తెలుసా..?

Hansika motwani: వన్నె తగ్గని గ్లామర్ తో కవ్విస్తున్న దేశముదురు భామ.. హన్సిక లేటెస్ట్ ఫొటోస్..

Russia-Ukraine: దయ చూపని రష్యా సేనలు.. ఆకలితో అలమటిస్తున్న ఉక్రెయిన్ పౌరులు