“మహా”లో మరో ట్విస్ట్..! రాజీనామా వార్తలపై సత్తార్ ఏమన్నారంటే..?

మహారాష్ట్ర రాజకీయంలో అప్పుడు ట్విస్టులపై ట్విస్టులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కూడా కాలేదు.. కానీ అప్పుడే అలకలు మొదలయ్యాయి. శివసేనకు చెందిన ఏకైక ముస్లిం ఎమ్మెల్యే అబ్దుల్ సత్తార్. అయితే కేబినెట్ విస్తరణలో సత్తార్‌కు మంత్రి పదవి వరించింది. కానీ కేబినెట్ హోదా దక్కలేదని అసంతృప్తికి గురయ్యారని.. దీంతో సత్తార్.. మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. మంత్రిగా ప్రమాణం చేసి ఐదు రోజులు దాటినా కూడా.. తనకు శాఖను కేటాయించకపోవడంపై సత్తార్ […]

మహాలో మరో ట్విస్ట్..! రాజీనామా వార్తలపై సత్తార్ ఏమన్నారంటే..?
Follow us

| Edited By:

Updated on: Jan 05, 2020 | 4:31 AM

మహారాష్ట్ర రాజకీయంలో అప్పుడు ట్విస్టులపై ట్విస్టులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కూడా కాలేదు.. కానీ అప్పుడే అలకలు మొదలయ్యాయి. శివసేనకు చెందిన ఏకైక ముస్లిం ఎమ్మెల్యే అబ్దుల్ సత్తార్. అయితే కేబినెట్ విస్తరణలో సత్తార్‌కు మంత్రి పదవి వరించింది. కానీ కేబినెట్ హోదా దక్కలేదని అసంతృప్తికి గురయ్యారని.. దీంతో సత్తార్.. మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి.

మంత్రిగా ప్రమాణం చేసి ఐదు రోజులు దాటినా కూడా.. తనకు శాఖను కేటాయించకపోవడంపై సత్తార్ అసహనానికి గురై, రాజీనామా చేశారని, ఇప్పటికే రాజీనామా లేఖను సీఎం ఉద్ధవ్ థాక్రేకి పంపినట్లు శనివారం ఉదయం నుంచీ వార్తలొచ్చాయి. దీంతో సత్తార్ స్పందించారు. తాను రాజీనామా చేశానన్న వార్తల్లో ఎంతమాత్రమూ వాస్తవం లేదన్నారు అబ్దుల్ సత్తార్. సీఎం ఉద్ధవ్ ఠాక్రేను కలిసి కేబినెట్ విస్తరణ అంశంపై మాట్లాడతానని.. సమావేశం తర్వాత సీఎం ఏ నిర్ణయం తీసుకున్నా..దానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.

మరోవైపు కేబినెట్‌ విస్తరణలో బెర్త్ కోసం ఆశలు పెట్టుకున్న పలువురు ఎమ్మెల్యేలకు విస్తరణలో చోటుక్కకపోవడంతో వారిని బుజ్జగించడం పార్టీలకు కత్తిమీద సాములా తయారైంది. ముఖ్యంగా శివసేన పార్టీకి. అటు కాంగ్రెస్ పార్టీ ఆశావాహులు కూడా.. మంత్రి పదవి రాలేదని అలక మొదలెట్టినట్లు తెలుస్తోంది. వారు కూడా రాజీనామా చేస్తారంటున్న వార్తలు గుప్పుమంటున్నాయి.