మహిళ చేతిలో ఫోన్‌ లాక్కుని పారిపోయిన దొంగ.. ఇంతలోనే స్మార్ట్‌వాచ్‌కు మెసేజ్.. చివరికి..

|

Oct 06, 2022 | 5:09 PM

ఓ మహిళ తన స్మార్ట్‌వాచ్ సాయంతో.. దొంగలించిన ఆమె మొబైల్‌ను ట్రేస్ చేసింది. అదెలాగని ఆలోచిస్తున్నారా.? అయితే ఈ స్టోరీ చదవండి..

మహిళ చేతిలో ఫోన్‌ లాక్కుని పారిపోయిన దొంగ.. ఇంతలోనే స్మార్ట్‌వాచ్‌కు మెసేజ్.. చివరికి..
Mobile Phone
Follow us on

దొంగలించినబడిన లేదా పోగొట్టుకున్న వస్తువులను తిరిగే పొందే అదృష్టవంతులు కొందరు మాత్రమే ఉంటారు. అందులో ఈమె ఒకరిని చెప్పాలి. హర్యానాలోని గురుగ్రామ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ తన స్మార్ట్‌వాచ్ సాయంతో.. దొంగలించిన ఆమె మొబైల్‌ను ట్రేస్ చేసింది. దొంగను కొట్టి తిరిగి తన ఫోన్‌ను దక్కించుకుంది. గురుగ్రామ్‌లోని సెక్టార్ 23లో ఆగష్టు 28న ఈ ఘటన చోటు చేసుకోగా.. దీనిపై ఆలస్యంగా అక్టోబర్ 3వ తేదీన ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

వివరాల్లోకి వెళ్తే.. ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తోన్న 28 ఏళ్ల మహిళ ఆగష్టు 28న కిరాణా సామాను కోసం సెక్టార్ 23లోని ఓ సూపర్ మార్కెట్‌కు వెళ్లింది. అక్కడ ఆమె డబ్బును చెల్లించేందుకు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తుండగా.. ఓ వ్యక్తి ఆమె చేతిలో నుంచి ఫోన్ లాక్కుని పారిపోయాడు. ఆ సమయంలో సదరు మహిళ అతడ్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. ఎలాంటి ప్రయోజనం లేకపోయింది.

మరోవైపు ఆమె మొబైల్‌ ఫోన్.. ఆమె ధరించిన స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ అయి ఉండటంతో.. దొంగను తనంతట తానే వెతకడం మొదలుపెట్టింది. ఆమె స్మార్ట్ వాచ్ ద్వారా తన మొబైల్ ఫోన్‌ను ట్రేస్ చేయాలని నిర్ణయించుకుంది. ఇంతలో స్మార్ట్‌ వాచ్‌కు మెసేజ్ వచ్చింది. తన ఫోన్ సమీపంలోనే ఉందని స్మార్ట్ ఫోన్ సూచిస్తూ బీప్ సౌండ్ రావడం మొదలైంది. దీంతో సదరు మహిళ సెక్టార్ 23 అంతటా మూడు గంటల పాటు తిరిగింది. చివరికి తన ఫోన్ ఎక్కడ ఉందో స్పష్టంగా ట్రాక్ చేయగలిగింది. ఓ వ్యక్తి మోటర్ సైకిల్‌పై తన మొబైల్ ఫోన్‌తో కూర్చుని ఉండటం గమనించింది. అదును చూసుకుని వెనుక నుంచి వెళ్లి అతడిని కొట్టి.. తన ఫోన్‌ను తిరిగి తీసుకుంది. మరోవైపు సదరు వ్యక్తి ఆ మూడు గంటల వ్యవధిలో ఆమె ఫోన్ ద్వారా సుమారు రూ. 50 వేల మేరకు ఆన్‌లైన్ లావాదేవీలు చేసినట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఘటనపై పోలీసులు సదరు మహిళ ఇచ్చిన కంప్లయింట్ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ న్యూస్ కోసం..