100 మంది రైతులపై ‘దేశద్రోహం’ కేసులు పెట్టిన హర్యానా పోలీసులు.. మరి సుప్రీంకోర్టు వ్యాఖ్యల మాటో ?
ఓ వైపు కాలం చెల్లిన దేశద్రోహం చట్టం ఇంకా మనకు అవసరమా అని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ప్రశిస్తుండగా.. మరో వైపు హర్యానా పోలీసులు 100 మంది రైతులపై దేశద్రోహం కేసులు పెట్టారు.
ఓ వైపు కాలం చెల్లిన దేశద్రోహం చట్టం ఇంకా మనకు అవసరమా అని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ప్రశిస్తుండగా.. మరో వైపు హర్యానా పోలీసులు 100 మంది రైతులపై దేశద్రోహం కేసులు పెట్టారు. అన్నదాతలు డిప్యూటీ స్పీకర్ రణబీర్ గంగ్వా కారును అడ్డగించి దాన్నిధ్వంసం చేయడంతో ఖాకీలు ఈ చర్య తీసుకున్నారు. కేంద్రం తెచ్చిన మూడు వివాదాస్పద రైతు చట్టాలను రద్దు చేయాలంటూ ముఖ్యంగా పంజాబ్, హర్యానా రైత్జులు ఆందోళన కొనసాగిస్తున్నారు. హర్యానాలో పాలక బీజేపీ- జన నాయక్ జనతా పార్టీ కూటమి నేతలను బహిష్కరిస్తామని, వారి కార్యక్రమాలను అడ్డుకుంటామని అన్నదాతలు హెచ్చరిస్తున్నారు. అయినా పాలక పార్టీల నాయకులు ఖాతరు చేయకుండా తాము పర్యటించాల్సిన ప్రాంతాలకు చేరుకుంటున్నారు. ఆ క్రమంలోనే సిర్సా లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన రణబీర్ గంగ్వా కాన్వాయ్ ని రైతులు అడ్డుకుని ఆయన కారుపై దాడికి పాల్పడ్డారు. కారు అద్దాలను పగులగొట్టారు.
అయితే రైతులపై దేశద్రోహం కేసులు పెట్టడం అన్యాయం, అక్రమమని సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు ఖండిస్తున్నారు. పోలీసుల చర్యను వారు తీవ్రంగా తప్పు పట్టారు. ఈ కేసులను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు.ఇవి తప్పుడు కేసులని అన్నారు. ఇలా ఉండగా సుప్రీంకోర్టు ఈ రోజే ఈ దేశద్రోహ చట్టంపై విరుచుకుపడింది. ఇది నిరంకుశమైనదని,75 ఏళ్ళ దేశ స్వాతంత్య్రం తరువాత కూడా ఇది అవసరమా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది మాజీ సైనికాధికారి ఒకరు దాఖలు చేసిన పిటిషన్ ను పురస్కరించుకుని కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో ఈ 100 మంది రైతులపై పోలీసులు దేశద్రోహం కేసులు పెట్టడం చర్చనీయాంశమైంది. మరి వీటిని వారు ఎలా మారుస్తారో అన్నది తెలియాల్సి ఉంది. .
మరిన్ని ఇక్కడ చూడండి: బీ అలెర్ట్ ! ప్రపంచం థర్డ్ వేవ్ ఆరంభ దశలో ఉందన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ.. జన సమూహాల రద్దీలు తగ్గాలని సూచన
100 farmers Sedition case