Gujarat Sniffer Dog: పోలీసులకు సేవలందిస్తున్న స్నిఫర్ డాగ్ మృతి.. శ్రద్ధాంజలి ఘటించిన తోటి కుక్కలు.. ఫోటో వైరల్

Gujarat Sniffer Dog: మనుషులు కంటే కుక్కలే నయం.. విశ్వాసం గలవి అంటే చాలామందికి కోపం వస్తుంది. కానీ రోజు రోజుకీ జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే మనిషికంటే కుక్క ఎంతో...

Gujarat Sniffer Dog: పోలీసులకు సేవలందిస్తున్న స్నిఫర్ డాగ్  మృతి.. శ్రద్ధాంజలి ఘటించిన తోటి కుక్కలు.. ఫోటో వైరల్
Sniffer Dog
Follow us
Surya Kala

|

Updated on: Jun 20, 2021 | 10:41 AM

Gujarat Sniffer Dog: మనుషులు కంటే కుక్కలే నయం.. విశ్వాసం గలవి అంటే చాలామందికి కోపం వస్తుంది. కానీ రోజు రోజుకీ జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే మనిషికంటే కుక్క ఎంతో బెటర్ అనిపించకమానదు.. డబ్బు వ్యామోహాల్లో పడిన మనిషి తల్లిదండ్రి, భార్య భర్త, పిల్లలు ఇలా ఏ బంధాన్ని అనుబంధాన్ని పట్టుకోవడం లేదని రోజు రోజుకీ జరుగుతున్న అనేక నేరాలు తెలియజేస్తున్నాయి. అయితే ఒక్క స్పర్శ..ఆప్యాయంగా పిలుస్తూ వేసే చిన్న బిస్కెట్ చాలు కుక్క మనల్ని జీవితాంతం గుర్తు పెట్టుకోవాటానికి.. మనం ఆ కుక్కలని మరచిపోయినా అవి.. మాత్రం మనల్ని జీవితాంతం గుర్తు పెట్టుకుంటాయి. మనుషుల పట్ల లెక్కకట్టలేనంత విశ్వాసాన్ని చూపిస్తాయి ఈ మూగజీవాలు. ఒక్క మనుషులతోనే కాదు.. సాటి జంతువుల పట్ల కూడా ఎంతో ప్రేమను కనబరుస్తాయి శునకాలు. అందుకు ఉదాహరణగా నిలిచింది గుజరాత్ లోని ఈ సంఘటన. వివరాల్లోకి వెళ్తే..

గుజరాత్‌ పోలీస్‌ విభాగంలో సేవలందిస్తున్న స్నిఫ్ఫర్‌ డాగ్‌ మీనా(7) అనారోగ్యంతో మృతి చెందింది. పోలీసులు మీనా అంతిమ సంస్కారాలకు ఏర్పాట్లు చేసి.. అంతకు ముందు మీనాకు అధికారులు పూలతో నివాళులు అర్పించారు. మీనా అంతిమ సమయంలో అక్కడ ఉన్న మరో రెండు స్నిఫ్ఫర్‌ డాగ్స్‌..దిగులుగా కనిపించాయి. అంతేకాదు.. మీనా భౌతికకాయం ముందు మోకరిల్లి నివాళులర్పించాయి. ఆ సమయంలో అక్కడ ఉన్న ఐపీఎస్‌ అధికారి శంషేర్‌ సింగ్‌ ఆ దృశ్యాన్ని ఫోటో తీశారు. తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ అవుతుంది. మానవత్వం, బంధాలను మరచిపోతున్న మనుషులకంటే కుక్కలు మేలు అంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Also Read: రొటీన్ కు భిన్నంగా.. బంగాళదుంపలతో రుచికరమైన హల్వా తయారీ విధానం