Viral: ప్రభుత్వ పాఠశాలలో మహిళా టీచర్‌తో హెడ్మాస్టర్ రాసలీలలు.. వైరల్
అది రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్‌లోని ఒక ప్రభుత్వ పాఠశాల. అక్కడి స్కూల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్‌లో హెడ్మాస్టర్ ఓ లేడీ టీచర్‌తో చేసిన రొమాన్స్ సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఆ దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ అంశాన్ని విద్యాశాఖ తీవ్రంగా పరిగణించింది. ఇద్దరిపై వేటు వేసింది.

పిల్లలను సరైన దారిలో పెట్టాల్సిన టీచర్స్ దారి తప్పారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే పవిత్రమైన పాఠశాలలో పాడు పనులకు తెగబడ్డారు. ఇద్దరు టీచర్స్ స్కూళ్లోనే అసభ్య కార్యకలాపాలు కొనసాగించారు. రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మహిళా ఉపాధ్యాయురాలితో ఓ ఉపాధ్యాయుడి రాసలీలల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
టీచర్ల నిర్వాకంపై తీవ్రంగా స్పందించిన ఉన్నతాధికారులు ఇద్దరిపైనా సస్పెన్షన్ వేటు వేశారు. పాఠశాల స్టాఫ్ రూమ్‌లో కొద్ది రోజులుగా సాగుతోన్న వీరి అసభ్య కార్యకలాపాలకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి. ఒకరినొకరు ముద్దు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం.. అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించిన దృశ్యాలు.. డీఈవో దృష్టికి రావడంతో తక్షణమే వారిని సస్పెండ్ చేశారు.
పాఠశాలలో టీచరమ్మతో ఉపాధ్యాయుడి రాసలీలల వ్యవహారం వెలుగుచూడటంతో గ్రామస్థులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకు పాఠాలు నేర్పించాల్సిన చోట ఇలాంటి పనులేంటని మండిపడుతున్నారు. వీరిద్దరిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
After a shameful video of a male and a female teacher at a school in Salera in Chittorgarh went viral people have been slamming them for shaming the temple of knowledge, meanwhile the District Education Officer has suspended them with immediate effect. pic.twitter.com/l1w0QXWdwp
— Megh Updates 🚨™ (@MeghUpdates) January 19, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.
