AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పట్టాలు తప్పిన గూడ్స్.. పలు ట్రైన్లు రద్దు

ముంబైలో ఇవాళ ఉదయం ఓ గూడ్సు రైలు పట్టాలు తప్పింది. దీంతో ముంబై- పూణే మార్గంలో పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. ముంబై- పూణే మార్గంలో తెల్లవారుజామున జంబుర్గ్- థాకూర్ వాడీ రైల్వేస్టేషన్ల మధ్య ఓ గూడ్సు రైలు పట్టాలు తప్పింది. రెండు బోగీలు నేలకొరిగాయి. దీంతో ముంబై నుంచి పూణేకు రావాల్సిన పలు రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. ముంబై-పూణే నగరాల మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. దూర ప్రాంతాల నుంచి రాకపోకలు […]

పట్టాలు తప్పిన గూడ్స్.. పలు ట్రైన్లు రద్దు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 01, 2019 | 7:42 AM

Share

ముంబైలో ఇవాళ ఉదయం ఓ గూడ్సు రైలు పట్టాలు తప్పింది. దీంతో ముంబై- పూణే మార్గంలో పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. ముంబై- పూణే మార్గంలో తెల్లవారుజామున జంబుర్గ్- థాకూర్ వాడీ రైల్వేస్టేషన్ల మధ్య ఓ గూడ్సు రైలు పట్టాలు తప్పింది. రెండు బోగీలు నేలకొరిగాయి. దీంతో ముంబై నుంచి పూణేకు రావాల్సిన పలు రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. ముంబై-పూణే నగరాల మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. దూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే రైళ్లను ఇగత్‌పురి రైల్వేస్టేషను మీదుగా దారి మళ్లించారు.