బైక్‌ను వెంటాడిన పులి.. వీడియో వైరల్!

మనం అప్పుడప్పుడూ రాత్రిపూట బైక్‌పై ఇంటికి వెళుతున్న సమయంలో వీధి కుక్కలు వెంటబడతాయి. బండి వేగం అమాంతం పెంచి.. వాటి నుంచి తప్పించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే అదే బైక్‌ను ఓ పులి వెంబడిస్తే.. ఇంకేముంది మన గుండెలు జారిపోయేంత పని జరుగుతుంది. సరిగ్గా ఇలాంటి ఘటన ఒకటి కేరళలోని వాయనాడ్ అడవులలో చోటు చేసుకుంది. ఇక దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోను పరిశీలిస్తే.. ఇద్దరు వ్యక్తులు ఆ […]

బైక్‌ను వెంటాడిన పులి.. వీడియో వైరల్!
Follow us

|

Updated on: Jun 30, 2019 | 6:27 PM

మనం అప్పుడప్పుడూ రాత్రిపూట బైక్‌పై ఇంటికి వెళుతున్న సమయంలో వీధి కుక్కలు వెంటబడతాయి. బండి వేగం అమాంతం పెంచి.. వాటి నుంచి తప్పించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే అదే బైక్‌ను ఓ పులి వెంబడిస్తే.. ఇంకేముంది మన గుండెలు జారిపోయేంత పని జరుగుతుంది. సరిగ్గా ఇలాంటి ఘటన ఒకటి కేరళలోని వాయనాడ్ అడవులలో చోటు చేసుకుంది. ఇక దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వీడియోను పరిశీలిస్తే.. ఇద్దరు వ్యక్తులు ఆ అరణ్య మార్గంలో బైక్‌పై వెళ్తున్నారు. అదే సమయంలో ఓ పులి ఎక్కడి నుంచో వీరిని గమనించి.. వెంబడించడం మొదలుపెట్టింది. దీంతో బైక్‌ వెనుక కూర్చున్న వ్యక్తి వీడియో తీయడం మొదలు పెట్టాడు. ఇక ఆ పులి వారిని కొన్ని సెకన్ల పాటు వెంబడించింది. బైక్ నడిపే వ్యక్తి ఏమాత్రం భయపడినా.. పులి వారిపై దాడి చేసేది. ఫారెస్ట్స్‌ అండ్‌ వైల్డ్‌లైఫ్‌ ప్రొటెక్షన్‌ సొసైటీ (ఎఫ్‌ఏడబ్ల్యూపీఎస్‌) అనే ఎన్జీవో ఈ వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసింది. ఇక ఆ బైక్‌పై ప్రయాణించేది అటవీశాఖ అధికారులని, ఆ ప్రాంతంలో పులుల సంచారం ఎలా ఉందనే విషయాన్ని అధ్యయనం చేయడానికి వారు వెళ్లగా, ఈ ఘటన చోటు చేసుకుందని ఎఫ్‌ఏడబ్ల్యూపీఎస్‌ తెలిపింది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతున్న తరుణంలో నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.