AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ ఎలుగు మనిషి ‘ ఉదంతం తుస్సుమంది

రష్యా, సైబీరియా సరిహద్దుల్లోని తువా అటవీప్రాంతంలో ఓ ఎలుగుబంటి దాడిలో గాయపడినట్టు వఛ్చిన వార్తలు తుస్సుమన్నాయి. 41 ఏళ్ళ అలెగ్జా‍ండ‌ర్ అనే ఈ వ్యక్తి అసలు ఎలుగు దాడిలో గాయపడలేదని, అతడు తన రోగి అని కజకిస్తాన్ లోని ఓ ఆసుపత్రి డాక్టర్ తేల్చి చెప్పాడు. రుస్తం ఇసయెవ్ అనే ఈ డాక్టర్..తన పేషంట్ సోరియాసిస్ తోను, ఇతర బ్బులతోను బాధ పడుతున్నాడని, మతి మరపుతో బాటు కొంతవరకు మతి స్థిమితం లేదని ఆయన తెలిపాడు. ఎలుగుబంటి […]

' ఎలుగు మనిషి ' ఉదంతం తుస్సుమంది
Pardhasaradhi Peri
| Edited By: |

Updated on: Jul 01, 2019 | 8:31 PM

Share

రష్యా, సైబీరియా సరిహద్దుల్లోని తువా అటవీప్రాంతంలో ఓ ఎలుగుబంటి దాడిలో గాయపడినట్టు వఛ్చిన వార్తలు తుస్సుమన్నాయి. 41 ఏళ్ళ అలెగ్జా‍ండ‌ర్ అనే ఈ వ్యక్తి అసలు ఎలుగు దాడిలో గాయపడలేదని, అతడు తన రోగి అని కజకిస్తాన్ లోని ఓ ఆసుపత్రి డాక్టర్ తేల్చి చెప్పాడు. రుస్తం ఇసయెవ్ అనే ఈ డాక్టర్..తన పేషంట్ సోరియాసిస్ తోను, ఇతర బ్బులతోను బాధ పడుతున్నాడని, మతి మరపుతో బాటు కొంతవరకు మతి స్థిమితం లేదని ఆయన తెలిపాడు. ఎలుగుబంటి ఇతడ్ని గాయపరచినట్టు వచ్చిన వార్తలను ఆయన ఖండించాడు. కొందరు వేటగాళ్ళు ఇతడిని ఓ ఎలుగుబంటి గుహలో చూశారని, తాను నెలరోజులుగా ఈ గుహలో ఉన్నట్టు అతగాడు చెప్పాడంటూ వారు ఓ వీడియో తీయడంతో అది వైరల్ అయిన సంగతి తెలిసిందే. కానీ ఇదంతా వట్టి పుకారేనని రుస్తం స్పష్టం చేశాడు. తన రోగి ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగుపడిందని, అతడ్ని అతడి తల్లి వఛ్చి వారి ఇంటికి తీసుకువెళ్ళిందని ఆయన వెల్లడించాడు. ఈ ఉదంతంలో… వీడియోను తీసినవారిపట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. కజకిస్తాన్ లోని యాక్తాబ్ మెడికల్ సెంటర్ అనే ఆసుపత్రిలో చికిత్స పొందిన ఈ రోగి అసలు ఆ గుహలోకి ఎలా వెళ్లాడన్నది మిస్టరీగా మారింది.

ఇంట్లో కలబంద మొక్కను ఈ దిశలో ఉంచితే దరిద్రం మీ వెంటే..
ఇంట్లో కలబంద మొక్కను ఈ దిశలో ఉంచితే దరిద్రం మీ వెంటే..
అజ్ఞాత వ్యక్తి కష్టం అనగానే.. అర్థరాత్రి లుంగీలో వెళ్లిన హీరో..
అజ్ఞాత వ్యక్తి కష్టం అనగానే.. అర్థరాత్రి లుంగీలో వెళ్లిన హీరో..
సింగిల్‌ ప్లాన్‌తోనే 4 సిమ్‌లు యాక్టివ్‌.. అన్‌లిమిటెడ్‌ కాల్స్‌,
సింగిల్‌ ప్లాన్‌తోనే 4 సిమ్‌లు యాక్టివ్‌.. అన్‌లిమిటెడ్‌ కాల్స్‌,
పులి పంజా విసిరినా వెనక్కి తగ్గని శునకం.. పోరాటి యజమానిని కాపాడి
పులి పంజా విసిరినా వెనక్కి తగ్గని శునకం.. పోరాటి యజమానిని కాపాడి
మొక్కజొన్నను ఇష్టంగా తింటున్నారా..? మీరు ఈ విషయం తెలుసుకోవాలి
మొక్కజొన్నను ఇష్టంగా తింటున్నారా..? మీరు ఈ విషయం తెలుసుకోవాలి
మేడారం జాతరలో మానవత్వం చాటుకున్న మంత్రి సీతక్క
మేడారం జాతరలో మానవత్వం చాటుకున్న మంత్రి సీతక్క
ఆ స్టార్ హీరో పై ప్రశంసలు కురిపించిన జయసుధ
ఆ స్టార్ హీరో పై ప్రశంసలు కురిపించిన జయసుధ
దీర్ఘాయుష్షు రహస్యం మీ చేతుల్లోనే.. ఈ చిన్న మార్పులు చేసుకుంటే..
దీర్ఘాయుష్షు రహస్యం మీ చేతుల్లోనే.. ఈ చిన్న మార్పులు చేసుకుంటే..
ఫిబ్రవరి 1 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతాయా?
ఫిబ్రవరి 1 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతాయా?
వాళ్లు చేసిన పనికి కారులో గంటసేపు ఏడ్చేశా..
వాళ్లు చేసిన పనికి కారులో గంటసేపు ఏడ్చేశా..