AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాహుల్‌ గాంధీ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు.. కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..

రాహుల్‌ గాంధీ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలకు ఈసీ ఇచ్చిన కౌంటర్‌ సంచలనం రేపింది. ఈ క్రమంలో ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల రోల్స్‌ను విడుదల చేయాలని ఈసీ నిర్ణయించింది. ఈసీ నిర్ణయాన్ని స్వాగతించిన రాహుల్‌ ఎప్పటిలోగా డేటా విడుదల చేస్తారో క్లారిటీ ఇవ్వాలన్నారు.

రాహుల్‌ గాంధీ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు.. కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
Rahul Gandhi
Shaik Madar Saheb
|

Updated on: Jun 10, 2025 | 7:58 AM

Share

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై రాహుల్‌గాంధీ చేస్తున్న ఆరోపణల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని , పోలైన ఓట్ల వివరాలన్నీ వెల్లడించాలని రాహుల్‌గాంధీ పదేపదే డిమాండ్‌ చేస్తున్నారు. రాహుల్‌గాంధీ డిమాండ్‌పై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రతో పాటు గుజరాత్‌ ఎన్నికల్లో పోలైన ఓట్ల వివరాలు వెల్లడిస్తామని తెలిపింది. 2009 నుంచి ఎన్నికల రోల్స్‌ను విడుదల చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.

ఈసీ నిర్ణయాన్ని స్వాగతిస్తూ రాహుల్‌గాంధీ ట్వీట్‌ చేశారు. అయితే ఈసీ తీసుకున్న తొలి మంచి నిర్ణయమని అన్నారు. అయితే ఏ తేదీన డేటాను విడుదల చేస్తారో కచ్చితంగా వెల్లడించాలన్నారు. డిజిటల్‌ రూపంలో ఎప్పుడు విడుదల చేస్తారో చెప్పాలని ట్వీట్‌ చేశారు. గత ఏడాది జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని , మ్యాచ్‌ ఫిక్సింగ్‌తో బీజేపీ గెలిచిందని పదేపదే విమర్శలు చేస్తున్నారు రాహుల్‌. అయితే రాహల్‌గాంధీ వ్యాఖ్యలను ఈసీ తీవ్రంగా ఖండించింది.

రాహుల్‌గాంధీ తీరుపై బీజేపీ నేతల ఆగ్రహం

రాహుల్‌గాంధీ తీరుపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఈసీని, సుప్రీంకోర్టును అవమానించే రీతిలో రాహుల్‌ మాట్లాడుతున్నారని అన్నారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి. రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించాల్సిన బాధ్యత విపక్ష నేతకు ఉండాలన్నారు. మనదేశంలో ఎన్నికలు చాలా పారదర్శకంగా జరుగుతాయని.. కాని రాహుల్‌గాంధీ మన శత్రుదేశం నేతల లాగా మాట్లాడుతున్నారన్నారు. రాజ్యాంగ వ్యవస్థలపై విపక్ష నేతకు గౌరవం ఉండాలంటూ సూచించారు.

కాంగ్రెస్‌ నేతలు మాత్రం రాహుల్‌ వ్యాఖ్యలను పూర్తిగా సమర్ధిస్తున్నారు. మహారాష్ట్రతో పాటు హర్యానా ఎన్నికల ఫలితాలపై ఇప్పటికి తమకు అనుమానాలు ఉన్నాయంటున్నారు కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ . రాహుల్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలను ఆయన సమర్ధించారు. రాహుల్‌ వాస్తవాలనే మాట్లాడారని.. ఎన్నికల కమిషన్‌ను నేరుగా అడిగారని పేర్కొన్నారు. ఐదు గంటల తరువాత పోలింగ్‌ వీడియోను ఇవ్వాలని.. కానీ అలా జరగలేదన్నారు. మహారాష్ట్ర , హర్యానాలో అక్రమాలు చేశారు. త్వరలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. బిహార్‌, తమిళనాడు, బెంగాల్‌, కేరళ, అసోంలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్నాయని.. ఈ ఏడాది బిహార్‌లో ఎన్నికలు ఉన్నాయని.. మ్యాచ్‌ఫిక్సింగ్‌లో బీజేపీ నేతలు చాలా ప్రసిద్దులంటూ జైరాం రమేష్ పేర్కొన్నారు.

మొత్తానికి రాహుల్‌గాంధీ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు కొత్త టర్న్‌ తీసుకున్నాయి. 2009 నుంచి ఎన్నికల రోల్స్‌ను విడుదల చేయాలని ఈసీ నిర్ణయించడం సంచలనం రేపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
వైస్ కెప్టెన్సీ పోస్ట్ పాయే.. వన్డే టీం నుంచి పీకేసే..
వైస్ కెప్టెన్సీ పోస్ట్ పాయే.. వన్డే టీం నుంచి పీకేసే..
రాత్రి అన్నం మిగిలిందా? రూపాయి ఖర్చు లేకుండా కరకరలాడే వడియాలు
రాత్రి అన్నం మిగిలిందా? రూపాయి ఖర్చు లేకుండా కరకరలాడే వడియాలు
ఏసీ రూముల్లో ఉన్నా శరీరం డీహైడ్రేట్ అవుతుందా..?
ఏసీ రూముల్లో ఉన్నా శరీరం డీహైడ్రేట్ అవుతుందా..?
సమ్మర్లో తులసి మొక్క గుబురుగా పెరగాలంటే గింజలు ఇలా చల్లాలి..
సమ్మర్లో తులసి మొక్క గుబురుగా పెరగాలంటే గింజలు ఇలా చల్లాలి..
ఆధార్ ఉన్నవారికి కేంద్రం అలర్ట్.. యాప్ సేవలు బంద్
ఆధార్ ఉన్నవారికి కేంద్రం అలర్ట్.. యాప్ సేవలు బంద్
భారత వన్డే జట్టులో ఐపీఎల్ హవా.. ఏ టీం నుంచి ఎంతమంది ఉన్నారంటే?
భారత వన్డే జట్టులో ఐపీఎల్ హవా.. ఏ టీం నుంచి ఎంతమంది ఉన్నారంటే?
OTT టాప్ ట్రెండింగ్‌లో రియల్ క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.4 రేటింగ్
OTT టాప్ ట్రెండింగ్‌లో రియల్ క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.4 రేటింగ్
చిన్న పిల్లలకు నూనె మసాజ్ చేయడం వల్ల ఇన్ని లాభాలా? తల్లిదండ్రులు
చిన్న పిల్లలకు నూనె మసాజ్ చేయడం వల్ల ఇన్ని లాభాలా? తల్లిదండ్రులు
రాత్రికి రాత్రే వీరి అప్పులు మొత్తం తీర్చేస్తారు..
రాత్రికి రాత్రే వీరి అప్పులు మొత్తం తీర్చేస్తారు..
ప్రపంచకప్ హీరోతోపాటు మరో ముగ్గురికి మొండిచేయి.. ఇంత అన్యాయమా?
ప్రపంచకప్ హీరోతోపాటు మరో ముగ్గురికి మొండిచేయి.. ఇంత అన్యాయమా?