AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manipur: యువకుడిపై అనుమానంతో ఆపిన పోలీసులు.. స్కూటీ చెక్ చేయగా మైండ్ బ్లాంక్..

టెక్నాలజీ మహిమో.. ఇంటర్నెట్ వాడకమో గానీ స్మగ్లర్లు తెలివి మీరిపోతున్నారు. కాప్స్ అడ్డుతగులుతున్నా.. క్రియేటివిటీకి..

Manipur: యువకుడిపై అనుమానంతో ఆపిన పోలీసులు.. స్కూటీ చెక్ చేయగా మైండ్ బ్లాంక్..
Scooter
Ravi Kiran
|

Updated on: Apr 27, 2022 | 8:41 AM

Share

టెక్నాలజీ మహిమో.. ఇంటర్నెట్ వాడకమో గానీ స్మగ్లర్లు తెలివి మీరిపోతున్నారు. కాప్స్ అడ్డుతగులుతున్నా.. క్రియేటివిటీకి పదునుపెట్టి తమ స్మగ్లింగ్ దండాను కొనసాగిస్తున్నారు. అయితే కస్టమ్స్ అధికారులు, పోలీసులను ఏమార్చడం అంత ఈజీ ఏం కాదు. వాళ్లు నిర్వహించే రెక్కిలో చివరికి స్మగ్లర్లు దొరికిపోవడం.. కథ కంచికి చేరడం జరుగుతోంది. తాజాగా రెండు వివిధ సంఘటనల్లో సుమారు 19 కేజీల బంగారాన్ని అక్రమ రవాణా చేసేందుకు యత్నించిన ఇద్దరు వ్యక్తులను మణిపూర్ కస్టమ్స్ అధికారులు, పోలీసులు కలిసి సంయుక్తంగా పట్టుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. మణిపూర్‌లోని చన్‌డేల్ జిల్లా తమ్మాపోప్కీలో ఓ స్కూటీలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నారని కస్టమ్స్ అధికారులకు సమాచారం అందింది. ఇంకేముంది వెంటనే స్పాట్‌కు వెళ్లి మోరెహ్ నుంచి వస్తోన్న రెడ్ స్కూటీని ఆపి కస్టమ్స్ అధికారులు, పోలీసులు తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీల్లో వారికి 50 బంగారం బిస్కెట్లు లభ్యమయ్యాయి. వీటిని నిందితులు స్కూటీలోని ఎయిర్ ఫిల్టర్లలో దాచి పెట్టినట్లు గుర్తించారు. ఆ బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అలాగే మరోవైపు బిస్కెట్ల రూపంలో దాదాపు 11 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన వ్యక్తిని ఎయిర్‌పోర్ట్‌లో పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. లగేజ్ బ్యాగ్ మధ్యలో బ్లాంకెట్ కింద ప్లాస్టిక్ కవర్‌లో బంగారాన్ని దాచినట్లుగా పోలీసులు గుర్తించారు.

ఇవి కూడా చదవండి

Also Read:

Gold

Follow Us
జపాన్‌పై థ్రిల్లింగ్ విక్టరీ.. ఊపిరి పీల్చుకున్న శ్రేయాస్ సేన..!
జపాన్‌పై థ్రిల్లింగ్ విక్టరీ.. ఊపిరి పీల్చుకున్న శ్రేయాస్ సేన..!
Paytmలో కొత్త ఫీచర్.. ఇక మీ పేమెంట్ హిస్టరీని దాచేయొచ్చు..
Paytmలో కొత్త ఫీచర్.. ఇక మీ పేమెంట్ హిస్టరీని దాచేయొచ్చు..
ఆరోగ్య రహస్యం చెప్పిన మురళీమోహన్..
ఆరోగ్య రహస్యం చెప్పిన మురళీమోహన్..
రాష్ట్రం మారొచ్చు.. భారత్‌ మారదు! రాజ్యాంగంలోని ఆ ఒక్క మాటే కారణం
రాష్ట్రం మారొచ్చు.. భారత్‌ మారదు! రాజ్యాంగంలోని ఆ ఒక్క మాటే కారణం
జిమ్‌లో అతిగా వర్కౌట్స్ చేస్తున్నారా? మూత్రం రంగు మారిందా? డేంజర్
జిమ్‌లో అతిగా వర్కౌట్స్ చేస్తున్నారా? మూత్రం రంగు మారిందా? డేంజర్
లాయర్‌ ఉద్యోగానికి గుడ్‌బై.. డాగ్‌ వాకర్‌గా మారిన 30 ఏళ్ల మహిళ..!
లాయర్‌ ఉద్యోగానికి గుడ్‌బై.. డాగ్‌ వాకర్‌గా మారిన 30 ఏళ్ల మహిళ..!
చపాతీలు మెత్తగా, పొరలు పొరలుగా రావాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి
చపాతీలు మెత్తగా, పొరలు పొరలుగా రావాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి
మైనర్ వేధింపుల కేసులో కీలక పరిణామం..!
మైనర్ వేధింపుల కేసులో కీలక పరిణామం..!
వేడి వేడి ఆహారాన్ని నేరుగా ఫ్రిజ్‌లో పెడుతున్నారా? జరిగే ప్రమాదం
వేడి వేడి ఆహారాన్ని నేరుగా ఫ్రిజ్‌లో పెడుతున్నారా? జరిగే ప్రమాదం
లంకపై ఘన విజయం.. గోల్డ్ మెడల్ పట్టేసిన భారత మహిళల టీం..
లంకపై ఘన విజయం.. గోల్డ్ మెడల్ పట్టేసిన భారత మహిళల టీం..