Viral: బాత్రుమ్ గోడలో 60 ఏళ్లనాటి బంగాళదుంప చిప్స్.. బయటికి తీసి రుచి చూడగా దెబ్బకు షాక్..
ఓ వ్యక్తికి తన ఇంటి బాత్రూమ్ గోడలో బంగాళదుంప చిప్స్ దొరికాయి. వాటిని అతడు వాసన చూసి.. రుచి చూడగా ఫ్యూజులు ఎగిరిపోయాయి.
ఓ వ్యక్తికి తన ఇంటి బాత్రూమ్ గోడలో బంగాళదుంప చిప్స్ దొరికాయి. వాటిని అతడు వాసన చూసి.. రుచి చూడగా ఫ్యూజులు ఎగిరిపోయాయి. బంగాళదుంప చిప్స్ ఏంటి.? అవి బాత్రూమ్ గోడలో దొరకడమేంటి.? అని ఆలోచిస్తున్నారా.? అయితే ఈ స్టోరీ చదవండి మీకే అర్ధమవుతుంది. ప్రపంచ మీడియాలో దీనిపై ఓ వార్త కూడా ప్రచురితమైంది
అసలు విషయానికొస్తే.. అమెరికాలోని ఇల్లినోయిస్‌కు చెందిన రోబ్ అనే వ్యక్తి.. తన బాత్రూమ్ గోడను రినోవేట్ చేసే క్రమంలో 60 ఏళ్ల నాటి మెక్‌డొనాల్డ్స్ ఫుడ్ బ్యాగ్‌ను కనుగొన్నాడు. మొదటిగా ఆశ్చర్యపోయిన ఆ వ్యక్తి.. ఆ బ్యాగ్ చుట్టూ ఎలుకలు ఉన్నాయా.? లేదా.? అన్నది చూశాడు. అలాగే బ్యాగ్‌ను తెరిచి చూడగా అందులో ఓ కాగితానికి ఫ్రెంచ్ ఫ్రైస్(బంగాళదుంప చిప్స్) చుట్టి ఉన్నట్లు గుర్తించాడు.. ఇక వాటిని తిని చూడగా అవి ఇంకా క్రిస్పీగా ఉన్నాయని అతడికి అర్ధమైంది.
ఇదే విషయాన్ని రోబ్ రెడిట్ ద్వారా నెటిజన్లతో పంచుకున్నాడు. 1959వ సంవత్సరంలో తమ ఇంటిని కట్టామని.. ఆ సమయంలో ఓ మెక్‌డొనాల్డ్ షాప్ తమకు దగ్గరలోనే ఉండేదని రోబ్ చెప్పుకొచ్చాడు. ఇంటిని నిర్మించే బిల్దర్స్ ఎవరైనా.. ఈ చిప్స్ బ్యాగ్‌ను తీసుకొచ్చి ఉంటారని రోబ్ తెలిపాడు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కాగా.. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఈ విషయాన్ని జోక్ అని కొట్టిపారేస్తే.. మరికొందరు అవునా.! అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.