Viral Video: ఈ బుడ్డోడు మాములోడు కాదండోయ్.. ఎనిమిదేళ్ల వయసులోనే దుమ్మురేపుతున్నాడు..
Viral Video: సాధారణంగా ఎమినిదేళ్ల వయసులో ఉన్న కుర్రాడు అప్పుడప్పుడే సైకిల్ నేర్చుకుంటుంటాడు. కింద పడుతూ లేస్తూ సైకిల్‌తో కుస్తీ పడుతుంటాడు. కానీ ఎనిమిదేళ్లలో కారు నడిపిస్తే ఎలా ఉంటుంది.? ఊహించుకోవడానికి కూడా వింతగా ఉంది కదూ.! కానీ...
Viral Video: సాధారణంగా ఎమినిదేళ్ల వయసులో ఉన్న కుర్రాడు అప్పుడప్పుడే సైకిల్ నేర్చుకుంటుంటాడు. కింద పడుతూ లేస్తూ సైకిల్‌తో కుస్తీ పడుతుంటాడు. కానీ ఎనిమిదేళ్లలో కారు నడిపిస్తే ఎలా ఉంటుంది.? ఊహించుకోవడానికి కూడా వింతగా ఉంది కదూ.! కానీ పాకిస్తాన్‌కు చెందిన ఓ కుర్రాడు మాత్రం అవలీలగా కారు నడిపించేస్తున్నాడు. అది కూడా ఓ భారీ ఎస్‌యూవీ కారు కావడం మరీ విశేషం. ప్రపంచమంతా యూట్యూబ్ ఫీవర్ ఉన్నట్లే పాకిస్తాన్‌లోనూ యూట్యూబర్లు తమ ట్యాలెంట్‌ను ప్రపంచానికి చాటుతున్నారు. ఇలా పాకిస్తాన్‌కు చెందిన అరీబా, అయాన్ అనే అక్కాతమ్ముళ్లు.. ‘అయాన్ అండ్ అరీబా షో’ పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్‌ను రన్ చేస్తున్నారు. ఇందులో వీడియోలను పోస్ట్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఎనిమిదేళ్ల అయాన్ కారు నడిపించిన వీడియోను పోస్ట్ చేశారు.
కనీసం సైకిల్ తొక్కడానికే సరిగ్గా కాళ్లు అందని ఆ కుర్రాడు అవలీలగా కారును నడిపించేస్తున్నాడు. టయోటా కంపెనీకి చెందిన భారీ ఎస్‌యూవీని నడిపించాడు. ఓవైపు యాక్సలేటర్, బ్రేక్‌లను ఆపరేట్ చేస్తూనే.. రోడ్డును పైకి లేచి చూస్తూ డ్రైవింగ్ చేస్తూ దూసుకుపోతున్నాడు. దీనంతటిని అతని తండ్రి దగ్గర ఉండి వీడియో తీశాడు. ఈ వీడియోను కాస్త యూట్యూబ్‌లో పోస్ట్ చేసేసరికి ప్రస్తుతం వైరల్‌గా మారింది.
అయితే ఈ వీడియో చూసిన కొందరు మాత్రం అంత చిన్న కుర్రాడికి కారు స్టీరింగ్ ఇస్తే ప్రమాదాలు జరగవా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇండియాలో మాదిరిగానే పాకిస్తాన్‌లోనూ డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి 18 ఏళ్లు నిండాలి. కానీ ఈ కుర్రాడు ఇలా కారు నడిపిస్తుండంపై మరి అక్కడి అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం క్లిక్ చేయండి..
Jeevitha Rajasekhar: జీవిత రాజశేఖర్ నన్ను బెదిరిస్తోంది : జోస్టర్ ఫిల్మ్ మెంబర్ హేమ