Viral Photo: ఈ ఫోటోలో మీరేం చూశారు.. మొదటిగా కనిపించేదే మీ వ్యక్తిత్వం.. అదేంటో తెలుసుకోండి!

ఆప్టికల్ ఇల్యూషన్.. ఇవి కళ్లను మాయ చేస్తుంటాయి. ఇందులో పైకి కనిపించేది ఒకటయితే.. లోపల వేరొకటి ఉంటుంది...

Viral Photo: ఈ ఫోటోలో మీరేం చూశారు.. మొదటిగా కనిపించేదే మీ వ్యక్తిత్వం.. అదేంటో తెలుసుకోండి!
Optical Illusion
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 26, 2022 | 5:00 PM

ఆప్టికల్ ఇల్యూషన్.. ఇవి కళ్లను మాయ చేస్తుంటాయి. ఇందులో పైకి కనిపించేది ఒకటయితే.. లోపల వేరొకటి ఉంటుంది. ఇక ఆ అసలు రహస్యాన్ని కనిపెట్టేందుకు మనం శతవిధాల ప్రయత్నిస్తాం. తగ్గేదేలే అన్నట్లుగా ఓ పట్టు పడుతుంటాం. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వాడకం ఎక్కువ కావడంతో ఆప్టికల్ ఇల్యూషన్స్ వైరల్ అయ్యాయని అనుకుంటే పొరపాటే.. ఈ ఆప్టికల్ ఇల్యూషన్స్ శతాబ్దాల నాటివి. మనుషుల వ్యక్తిత్వాలను అంచనా వేసే.. వీటిని సైకాలజిస్టులు విరివిగా వాడుతుంటారు. ఇక అలాంటి కోవకు చెందిన ఓ ఆప్టికల్ ఇల్యూషన్ ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. తమిళనాడులోని ఐరావతేశ్వర్ గుడిలో చెక్కబడిన ఈ ఆప్టికల్ ఇల్యూషన్ 900 ఏళ్ల నాటి శిల.

పైన పేర్కొన్న ఫోటోలో మీకేం కనిపిస్తోంది. దానిని చూడగానే ఠక్కున అందరూ మొదటిగా ఎద్దు అని చెబుతారు. అయితే అందులో ఎద్దు, ఏనుగు ఉన్నాయి. అవి రెండూ ఒకే తలను పంచుకున్నాయి. మీ మెదడుకు పరీక్ష పెట్టే ఇలాంటి పజిల్స్ పూర్వకాలం నుంచే ఉన్నాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఇక ఆ ఫోటో మీ వ్యక్తిత్వం గురించి ఏం చెబుతోందంటే..

ఎద్దు:

ఈ ఫోటోలో మీకు మొదటిగా ఎద్దు కనిపించినట్లయితే.. మీరు మొండి, క్రూరంగా ఉంటారని అర్ధం. అసాధ్యం అనిపించే సమయాల్లో బలంగా, సానుకూలంగా ఎలా ఉండాలో మీకు బాగా తెలుసు.

ఏనుగు:

ఒకవేళ మీకు ముందుగా ఏనుగు కనిపిస్తే.. మీ స్నేహితులు, కుటుంబసభ్యుల పట్ల విశ్వాసంతో, వినయవిధేయతలతో నడుచుకుంటారు. అలాగే మీరు ప్రతీ విషయంలోనూ ఎంతో ఆలోచనాత్మకంగా వ్యవహరిస్తారు. ఇతరుల పట్ల దయ చూపిస్తారు.