Goa Election 2022: గోవాలో బీజేపీ హ్యాట్రిక్.. 20 సీట్లను కైవసం చేసుకున్న కమలం పార్టీ..

Goa Assembly Elections 2022 Results: గోవాలో బీజేపీ ప్రభంజనాన్ని సృష్టించి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకుంది. 40 సీట్లు ఉన్న గోవాలో 20 సీట్లల్లో బీజేపీ ఘన విజయం సాధించింది.

Goa Election 2022: గోవాలో బీజేపీ హ్యాట్రిక్.. 20 సీట్లను కైవసం చేసుకున్న కమలం పార్టీ..
Goa
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 10, 2022 | 10:07 PM

Goa Assembly Elections 2022 Results: గోవాలో బీజేపీ ప్రభంజనాన్ని సృష్టించి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకుంది. 40 సీట్లు ఉన్న గోవాలో 20 సీట్లల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. గోవాలో సీఎం ప్రమోద్ సావంత్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మరోసారి (Goa Election Results 2022) అధికారాన్ని చేపట్టబోతోంది. గోవాలో కాంగ్రెస్ పార్టీ అంతలా ప్రభావం చూపెట్టలేకపోయింది. మొదట హంగ్ వస్తుందని భావించినప్పటికీ.. బీజేపీ పూర్తి ఆధిక్యంతో ఫలితాల్లో దూసుకెళ్లింది. ముగ్గురు స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో బీజేపీ మూడోసారి అధికారాన్ని చేపట్టబోతోంది.

గోవాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే..?

బీజేపీ 20

కాంగ్రెస్ 11

ఆమ్ ఆద్మీ పార్టీ 2

మహారాష్ట్రవాది గోమంతక్ 2

గోవా ఫార్వర్డ్ పార్టీ 1

రివల్యూషనరీ గోన్స్ పార్టీ 1

స్వతంత్ర అభ్యర్థులు 3

Also Read:

Punjab Election 2022: పంజాబ్‌లో 92 స్థానాల్లో ఆమ్ ఆద్మీ జయకేతనం.. ముఖ్యమంత్రి ఆయనే..

CM Yogi: ఏయ్‌ బిడ్డా.. ఇది యూపీ గడ్డ.. యోగి అడ్డా.. 37 ఏళ్ల చరిత్రను తిరగరాసిన బీజేపీ..