Viral: అబ్బాయిల ఒడిలో అమ్మాయిలు.. ఇలా ఎందుకు కూర్చున్నారో తెలియాలంటే ఈ స్టోరీ చదవేయండి
ప్రస్తుత కాలంలో అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరూ సమానమే. వారి మధ్య స్నేహపూర్వక వాతావరణం, కలిసిపోయే తత్వం ఉండటం సహజమే. అయితే తమ కళాశాలలో చదువుకునే విద్యార్థినీ, విద్యార్థులు దగ్గర దగ్గరగా కూర్చోకుండా కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్...
ప్రస్తుత కాలంలో అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరూ సమానమే. వారి మధ్య స్నేహపూర్వక వాతావరణం, కలిసిపోయే తత్వం ఉండటం సహజమే. అయితే తమ కళాశాలలో చదువుకునే విద్యార్థినీ, విద్యార్థులు దగ్గర దగ్గరగా కూర్చోకుండా కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ తిరువనంతపురం (Thiruvananthapuram) వింత చర్యకు పాల్పడింది. ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన కొంత మంది విద్యార్ధులు తాము రోజూ కూర్చునే బెంచ్ వద్దకు వెళ్లారు. అక్కడ స్టీలు బెంచ్‌ను మూడు సింగిల్ సీట్లను తొలగించి, దూరం దూరంగా ఉండటాన్ని గమనించారు. అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి కూర్చోవడాన్ని వ్యతిరేకిస్తూ చేసిన పని అని వారు గ్రహించారు. వెంటనే వారు నిరసన తెలిపేందుకు రెడీ అయ్యారు. పక్కపక్కన కూర్చోకుండా చేయడం వల్ల తమలో లింగ బేధం భావన వస్తుందని, ఇది తమ స్థైర్యాన్ని దెబ్బ తీస్తుందని ఆగ్రహంతో ఊగిపోయారు. అబ్బాయిలు బెంచీలపై కూర్చోగా.. అమ్మాయిలు వారి ఒళ్లో కూర్చుని వినూత్న నిరసన తెలిపారు. ఇలాంటి తక్కువ స్థాయి ఆలోచనలు తమ స్నేహాన్ని ఆపలేవని మండిపడ్డారు. ఒకరి పక్కన కూర్చోలేం కానీ కచ్చితంగా ఒడిలో కూర్చోగలమని స్పష్టం చేశారు.
ఈ అంశంపై కళాశాల యాజమాన్యం స్పందించింది. క్యాంపస్ లో విద్యార్థినులను వేధిస్తున్న సమస్యలు అధికంగా ఉన్నాయని, వాటిని నివారించేందుకు సీటింగ్ లో మార్పులు చేశామని వెల్లడించారు. అంతే కాకుండా బయటి వారు కూడా వచ్చి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని, వారి చర్యలు తమకు అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయని చెప్పారు. కాగా తిరువనంతపురం నగర మేయర్ ఆర్య ఎస్ రాజేంద్రన్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. బెంచీని మూడు సీట్లకు కుదించిన విధానం అనుచితమని అభిప్రాయ పడ్డారు. రాష్ట్రంలో అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి కూర్చోవడంపై నిషేధం లేదని వెల్లడించారు.
തിരുവനന്തപുരം കോളേജ് ഓഫ് എൻജിൻറിങ്ങിന് അടുത്തുള്ള ബസ് കാത്തിരിപ്പ് കേന്ദ്രത്തിലെ ഇരിപ്പിടം മുറിച്ച് മൂന്നാക്കിയത് അനുചിതവും പുരോഗമന സമൂഹത്തിന് ചേരാത്തതുമാണ്. https://t.co/yp0PoRIvnt pic.twitter.com/np0T0sZ3Sf
— Arya Rajendran S (@SAryaRajendran) July 21, 2022
విద్యార్థుల నిరసనను అభినందిస్తూ, స్పందించే తరం భవిష్యత్తుకు ఆశాజనకంగా ఉందని చెప్పారు. ఈ విషయంలో స్థానిక అధికారులు విద్యార్థుల పక్షాన ఉన్నారని పేర్కొన్నారు. బస్ వెయిటింగ్ షెడ్ శిథిలావస్థకు చేరుకుందని, అందుకోసం అక్కడ మున్సిపాలిటీ ద్వారా ఆధునిక సౌకర్యాలతో కూడిన కొత్త వెయిటింగ్ షెడ్ నిర్మిస్తామని ఆమె తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి