Ganga Water: గంగానది నీటిలో కరోనా జాడే లేదు.. అధ్యయనంలో కీలక విషయాలు వెల్లడి

Ganga River Water - Covid-19: దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ విలయతాండవం సృష్టించి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. అయితే.. సెకండ్ వేవ్ సమయంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మరణాలు

Ganga Water: గంగానది నీటిలో కరోనా జాడే లేదు.. అధ్యయనంలో కీలక విషయాలు వెల్లడి
Ganga River Water
Follow us

|

Updated on: Jul 08, 2021 | 10:31 AM

Ganga River Water – Covid-19: దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ విలయతాండవం సృష్టించి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. అయితే.. సెకండ్ వేవ్ సమయంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మరణాలు సంభవించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో యూపీ, బీహార్ ప్రాంతాల్లో గంగానదిలో పెద్ద ఎత్తున మృతదేహాలు కొట్టుకువచ్చాయి. అంతేకాకుండా గంగానది ఒడ్డున ఇసుకలో కూడా పెద్ద ఎత్తున శవాలు బయటపడిన సంగతి తెలిసిందే. అవన్నీ కరోనా మృతులవేనన్న అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో గంగా నదిలో కరోనా మహమ్మారి ఆనవాళ్లను తెలుసుకునేందుకు కేంద్రం.. ఉత్తరప్రదేశ్‌, బీహా‌ర్‌ రాష్ట్రాల్లో అధ్యయనం సైతం చేపట్టింది. ఈ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ఆధ్యయనంలో కీలక విషయం వెల్లడైంది.

గంగానది నీటిలో కరోనా వైరస్ జాడ లేదని తాజాగా వెల్లడైంది. ఈ మేరకు కన్నూజ్, ఉన్నవో, కాన్పూర్, హమీర్‌పూర్, అలహాబాద్, వారణాసి, బాలియా, బక్సర్, ఘాజిపూర్, పాట్నా, ఛప్రా ప్రాంతాల్లోని గంగా నది నుంచి నీటి నమూనాలను తీసుకొని పరిశీలించారు. రెండు దశల్లో చేపట్టిన ఈ అధ్యయనంలో గంగానదిలో కరోనావైరస్ జాడ లేదని పరిశోధకులు వెల్లడించారు. నీటి నమూనాల నుంచి వైరస్ ఆర్ఎన్ఏను సేకరించి వైరోలాజికల్ పరీక్ష చేయగా ఎలాంటి కరోనా ఆనవాళ్లు లేవని నిర్ధారణ అయింది.

ఈ అధ్యయనాన్ని కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సిఎస్ఐఆర్) ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్ (ఐఐటిఆర్), లక్నో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, రాష్ట్ర కాలుష్య నియంత్రణ నియంత్రణ మండలి సహకారంతో జల్‌శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. కరోనా మృతదేహాలను గంగా నదిలో పడేసినా నీటిలో కరోనావైరస్ జాడ కనిపించలేదని శాస్త్రవేత్తలు బుధవారం పేర్కొన్నారు.

Also Read:

Coronavirus: కోవిడ్‌ మహమ్మారితో ప్రపంచం ప్రమాదకరస్థితిలో ఉంది.. 40 లక్షల కరోనా మరణాలు: డబ్ల్యూహెచ్‌వో

Almonds for Diabetes: డయాబెటిక్‌ పేషెంట్స్‌కి గుడ్‌న్యూస్.. బాదంతో మహమ్మారికి చెక్.. ఎలా అంటే..