AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అంగట్లో విద్యార్థుల భవిష్యత్తు.. 5 ఏళ్లలో ఎన్నో లీకులు.. కేంద్రం తెచ్చిన ఈ చట్టం గురించి తెలుసా..?

దేశంలో పోటీ పరీక్షల నిర్వహణ తీరు ప్రశ్నార్థకంగా మారింది. ప్రశ్నపత్రాల లీకేజీ విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను కలవరపెడుతుంది. కొంతమంది పేరెంట్స్ ఏకంగా రూ.30లక్షలు పెట్టి క్వశ్చన్ పేపర్ కొనడం గమనార్హం. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గతంలో తెచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్-2024 చట్టం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ చట్టం ప్రకారం పేపర్ లీక్‌కు పాల్పడితే కఠిన శిక్షలు పడతాయి.

అంగట్లో విద్యార్థుల భవిష్యత్తు.. 5 ఏళ్లలో ఎన్నో లీకులు.. కేంద్రం తెచ్చిన ఈ చట్టం గురించి తెలుసా..?
Why India Competitive Exams Are Facing Paper Leaks
Krishna S
|

Updated on: May 14, 2026 | 10:55 AM

Share

దేశంలో ఒకప్పుడు పరీక్ష అంటే విద్యార్థుల ప్రతిభకు కొలమానం. కానీ గత ఐదేళ్లుగా పరీక్ష అంటే లీకేజీ అనే భయం పట్టుకుంది. లక్షలాది మంది విద్యార్థుల కల అయిన నీట్ 2026 పరీక్ష ప్రశ్నపత్రం లీక్ కావడం, ఆ తర్వాత పరీక్ష రద్దు కావడం దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది. కేవలం 30 నిమిషాల యాక్సెస్‌తో 120 ప్రశ్నలను దొంగిలించి, దేశమంతటా వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ చేశారంటే, ఈ వ్యవస్థీకృత నేరం ఎంత లోతుగా పాతుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇది కేవలం ఒక ఏడాదికి పరిమితమైన సమస్య కాదు, గత ఐదేళ్లుగా వరుస లీకేజీలు, వ్యవస్థీకృత నేరాలు విద్యావ్యవస్థను పట్టిపీడిస్తున్నాయి. గత ఐదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే అధికారుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం నీట్ మాత్రమే కాదు అనేక ప్రతిష్టాత్మక పరీక్షలు లీకేజీల బారిన పడ్డాయి.

గత ఐదేళ్ల లీక్ చరిత్ర

2021 నుండి 2026 వరకు దేశంలో దాదాపు ప్రతి ప్రధాన పరీక్ష వివాదాల్లో చిక్కుకుంది. అధికారుల నిర్లక్ష్యం, మాఫియా కుతంత్రాల వల్ల విద్యార్థులు బలి అవుతున్నారు.

నీట్ – నెట్ (2024-2026): పేపర్ లీక్ కారణంగా లక్షలాది మంది విద్యార్థులు రెండోసారి పరీక్ష రాయాల్సిన పరిస్థితి.

బీహార్ పోలీస్ – ఎయిమ్స్ నర్సింగ్ (2023): రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో భారీ ఎత్తున అక్రమాలు వెలుగుచూశాయి.

రీట్ : రాజస్థాన్‌లో జరిగిన ఈ పరీక్ష లీకేజీ వల్ల సుమారు 16 లక్షల మంది విద్యార్థులు నష్టపోయారు.

జేఈఈ మెయిన్: టెక్నాలజీని ఉపయోగించి రిమోట్ యాక్సెస్ ద్వారా పరీక్షలు రాయించిన మోసాలు బయటపడ్డాయి.

అసలు లీక్ ఎలా జరుగుతోంది..?

నిపుణుల కమిటీ నివేదికల ప్రకారం.. ప్రశ్నాపత్రం ప్రింటింగ్ కేంద్రం నుండి విద్యార్థి చేతికి చేరే వరకు మూడు ప్రధాన దశల్లో ప్రమాదం పొంచి ఉంది.

రవాణా – నిల్వ: ప్రశ్నాపత్రాలను తీసుకెళ్లే ట్రక్కులు, అవి భద్రపరిచే ట్రెజరీ గదుల వద్ద భద్రతా లోపాలు.

మానవ ప్రమేయం: పరీక్షా కేంద్రాల నిర్వాహకులు, కోచింగ్ సెంటర్ల యజమానులు, అధికారుల మధ్య ఉన్న సంబంధాలు. నాసిక్ కేసులో రూ.10 లక్షలకు కొని రూ.15 లక్షలకు అమ్మడం దీనికి ప్రత్యక్ష సాక్ష్యం.

టెక్నాలజీ దుర్వినియోగం: డార్క్ వెబ్, ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్స్ ద్వారా నిమిషాల వ్యవధిలో పేపర్లను వేల మందికి చేరవేయడం.

తల్లిదండ్రుల ఆవేదన..

ఒక తండ్రి తన కొడుకు కోసం రూ.30 లక్షలు వెచ్చించి పేపర్ కొన్న ఉదంతం విస్తుగొలుపుతోంది. మధ్యతరగతి తల్లిదండ్రులు తమ పిల్లలను డాక్టర్లు, ఇంజనీర్లుగా చూడాలని తమ ఆస్తులను అమ్మి, అప్పులు చేసి మరీ కోచింగ్ సెంటర్లకు లక్షలు పోస్తున్నారు. కానీ తీరా పరీక్ష ముగిశాక పేపర్ లీక్ అని తెలియగానే ఆ కుటుంబాలు మానసికంగా, ఆర్థికంగా కుప్పకూలిపోతున్నాయి.

పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్, 2024

ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం కీలకమైనది. జూన్ 21, 2024న అమల్లోకి వచ్చిన ఈ చట్టం కఠిన నిబంధనలను కలిగి ఉంది. నేరానికి పాల్పడిన వ్యక్తికి 3 నుండి 5 ఏళ్ల జైలు, అదే వ్యవస్థీకృత నేరం అయితే 10 ఏళ్ల వరకు జైలు శిక్ష. వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే సంస్థలు లేదా వ్యక్తులకు రూ.1 కోటి వరకు జరిమానా. అక్రమాలకు పాల్పడిన విద్యాసంస్థలు లేదా ఏజెన్సీలను శాశ్వతంగా నిషేధించడం.

రాష్ట్రాల డిమాండ్ – భవిష్యత్తు మార్గం

తమిళనాడు వంటి రాష్ట్రాలు నీట్ వంటి పరీక్షలను రద్దు చేయాలని బలంగా డిమాండ్ చేస్తున్నాయి. విద్యార్థుల ప్లస్ టూ మార్కుల ఆధారంగానే అడ్మిషన్లు ఇవ్వడం వల్ల ఇలాంటి మాఫియాకు చెక్ పెట్టవచ్చని వారి వాదన. అలాగే పరీక్షా కేంద్రాల్లో బయోమెట్రిక్ వెరిఫికేషన్, డిజిటల్ క్వశ్చన్ పేపర్లు వంటి సంస్కరణలు రావాల్సిన అవసరం ఉంది.

Follow Us