AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రిలీజ్ రోజు సూర్య సినిమాకు ఊహించని షాక్.. నిరాశలో అభిమానులు

కోలీవుడ్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విభిన్న కంటెంట్ చిత్రాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. కంగువ, రెట్రో చిత్రాలతో అలరించిన సూర్య.. ఇప్పుడు సరైన హిట్టు కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు కరుప్పుతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

రిలీజ్ రోజు సూర్య సినిమాకు ఊహించని షాక్.. నిరాశలో అభిమానులు
Karuppu
Rajeev Rayala
|

Updated on: May 14, 2026 | 10:38 AM

Share

స్టార్ హీరో సూర్య చాలా కాలంగా హిట్స్ లేక సతమతం అవుతున్నారు. వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ ఆ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. చివరిగా వచ్చిన రెట్రో సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దాంతో సూర్య అభిమానులు ఒకింత నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడుసూర్య నటిస్తున్న కరుప్పు ( తెలుగులో వీరభద్రుడు ) సినిమా భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు నటుడు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించారు. అలాగే స్టార్ హీరోయిన్ త్రిష ఈమూవీలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో సూర్య లాయర్ గా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని అనుకుంటున్నా సమయంలో సూర్య సినిమాకు బిగ్ షాక్ ఇచ్చింది.

ఇది కూడా చదవండి : బాబోయ్.. ఇదెక్కడి రొమాంటిక్ సిరీస్ రా బాబు..! ప్రపంచవ్యాప్తంగా 240కి పైగా దేశాల్లో స్ట్రీమింగ్

ఇటీవలే కోలీవుడ్ లో స్పెషల్ షోలకు పర్మిషన్ ఇస్తూ విజయ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.. చాలా కాలంగా కోలీవుడ్ స్పెషల్ షోలకు అనుమతి లేదు. విజయ్ సర్కార్ రాగానే స్పెషల్ షోలకు పర్మిషన్ ఇచ్చింది. ఉదయం 9గంటలకు షో ప్రారంభం చేసుకోవచ్చు అని తెలిపింది. వీరభద్రుడు సినిమాకు 14,15 న స్పెషల్ షోలకు పర్మిషన్ ఇచ్చింది. కానీ అభిమానులు ఊహించని షాక్ తగిలింది. సూర్య సినిమా స్పెషల్ షోలు పడలేదు.

ఇది కూడా చదవండి : 14ఏళ్లకే ఎంట్రీ.. పెళ్ళైన దర్శకుడితో ఎఫైర్.. కట్ చేస్తే ఫ్యాన్‌కు ఉరేసుకొని..

ప్రపంచవ్యాప్త ప్రీమియర్‌లకు కేవలం కొన్ని గంటల ముందు సూర్య చిత్రం ‘వీరభద్రుడు’ (కరుప్పు)కు ఎదురుదెబ్బ తగిలింది. అనివార్య పరిస్థితుల కారణంగా ఉదయం 9 గంటల షోలన్నీ రద్దు చేసినట్లు నిర్మాత ఎస్.ఆర్. ప్రభు ప్రకటించారు. ఈ ఆలస్యానికి గల కచ్చితమైన కారణం ఇంకా స్పష్టంగా తెలియనప్పటికీ, రెగ్యులర్ షోలు మాత్రమే ప్రదర్శిస్తున్నారు. స్పెషల్ షోలు లేకపోవడంతో సూర్య ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ అవ్వడంతో .. ఇప్పుడు స్పెషల్ షోలు లేకపోవడం పై అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఆ హీరో నాకు గంటసేపు క్లాస్ క్లాస్ తీసుకున్నాడు.. ఆయన మాటలు ఒక ఇంజెక్షన్‌లా పని చేశాయి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us