Azadi ka Amrit Mahotsav: తన పేరుతోనే బ్రిటిష్ వారిని వణికించిన వీరనారి.. దొంగ దెబ్బతో యుద్ధంలో మరణించిన లక్ష్మీబాయి..

1858 జూన్ 18న గ్వాలియర్‌లో బ్రిటిష్ వారితో జరిగిన యుద్ధంలో లక్ష్మీబాయిని దొంగచాటుగా చంపారు. కదన రంగంలో అమరురాలైంది. స్వాతంత్య దినోత్సవ 75వ ఉత్సవాల సందర్భంగా ఈరోజు గొప్ప వీరనారి లక్ష్మీబాయి జీవిత కథ గురించి తెలుసుకుందాం.. 

Azadi ka Amrit Mahotsav: తన పేరుతోనే బ్రిటిష్ వారిని వణికించిన వీరనారి.. దొంగ దెబ్బతో యుద్ధంలో మరణించిన లక్ష్మీబాయి..
Freedom Fighters
Surya Kala

|

Jul 30, 2022 | 1:48 PM

Azadi ka Amrit Mahotsav: 1857లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించిన వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి.   అసలు పేరు మణికర్ణిక.  నవంబరు 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. బ్రిటిష్ వారిపై పోరాడటానికి తన దత్తపుత్రుడిని వీపుపై గుడ్డతో కట్టుకుని ఝాన్సీ నుండి కల్పికి,  తరువాత గ్వాలియర్‌కు చేరుకుంది. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బ్రిటిష్ సైనికులతో పోరాడిన ధైర్యవంతురాలు. దేశం కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన వీరనారి.  లక్ష్మీబాయికి బ్రిటీష్ వారు అనేక ప్రలోభాలు పెట్టారు.. అయినప్పటికి బానిసత్వానికి అంగీకరించకుండా స్వాతంత్య్రం కోసం బ్రిటిష్ వారికి కూడా వణుకు పుట్టించే విధంగా యుద్ధం ప్రకటించింది. 1858 జూన్ 18న గ్వాలియర్‌లో బ్రిటిష్ వారితో జరిగిన యుద్ధంలో లక్ష్మీబాయిని దొంగచాటుగా చంపారు. కదన రంగంలో అమరురాలైంది. స్వాతంత్య దినోత్సవ 75వ ఉత్సవాల సందర్భంగా ఈరోజు గొప్ప వీరనారి లక్ష్మీబాయి జీవిత కథ గురించి తెలుసుకుందాం..

కాశీలో జననం: రాణి లక్ష్మీబాయి 1828 నవంబర్ 19న కాశీలో జన్మించింది. తండ్రి మోరోపంత్ తాంబే , తల్లి భాగీరథీ బాయి. ఆమెకు మణికర్ణిక అని పేరు పెట్టారు. అయితే ఆమెను ముద్దుగా మను అని పిలిచేవారు. మణికర్ణికకు నాలుగేళ్ళ వయసున్న సమయంలో తల్లి భాగీరథీ బాయి మరణించింది. దీంతో తండ్రి మోరోపంత్ వారిని బితూర్ పేష్వా బాజీరావు వద్దకు మణికర్ణికను తీసుకెళ్లారు.

పేష్వా పేరు ఛబిలి మోరోపంత్ తాంబే పేష్వా బాజీరావు ఆస్థానంలో ఉండేవారు. ఇంటిని చూసుకునేవారు లేకపోవడంతో మను కూడా తండ్రి ఆస్థానానికి తీసుకుని వెళ్లేవారు. మను చలాకీ తనం, తెలివి తేటలతో కొన్ని రోజుల్లోనే సభలోని వారందరికీ ఇష్టురాలిగా మారింది. పేష్వా.. బాజీరావ్ II కి మను స్వభావం నచ్చింది. మనును దగ్గరకు తీసుకుని మనుకు ఛబిలి అని పేరు పెట్టి.. ముద్దుగా చూసేవారు.

నానా సాహెబ్‌తో కలిసి యుద్ధ వ్యూహం నేర్చుకున్న మను  బాజీరావు IIకి పిల్లలు లేకపోవడంతో..  1827లో నానా సాహిబ్‌ని దత్తత తీసుకున్నాడు. మను బితూర్‌కు వచ్చిన తర్వాత.. నానా సాహెబ్.. మను ఇద్దరూ కలిసి పెరిగారు. ఈ సమయంలో నానా సాహెబ్ తో కలిసి మణికర్ణిక గుర్రపు స్వారీ, మల్ల విద్య వంటి ఇతర యుద్ధ కళలను నేర్చుకుంది. ఆయుధాలతో యుద్ధ విధ్యాలతో పాటు అనేక గ్రంథాలను కూడా పాటించింది. ఇద్దరూ కలిసి ఏనుగుల మీద స్వారీ చేసేవారు, యుద్ధ శాస్త్రంలో తర్పీదు పొందారు.

1842లో రాజా గంగాధరరావుతో వివాహం 1842లో ఝాన్సీ రాజైన గంగాధరరావుతో లక్ష్మీబాయి వివాహం ఘనంగా జరిగింది. బితూర్‌కు చెందిన మను ( ఛబిలి) ఝాన్సీకి చెందిన రాణి లక్ష్మీబాయిగా మారింది. 1851లో, లక్ష్మీబాయి ఓ ఒక కుమారుడు కలిగాడు. అయితే నాలుగు నెలల తర్వాత కుమారుడు మరణించాడు. కొడుకు మరణంతో రాజా గంగాధరరావు తీవ్ర మనస్తాపానికి గురై అస్వస్థతకు గురయ్యాడు. దీంతో ఈ దంపతులు స్వంత కుటుంబానికి చెందిన వాసుదేవ్ నెవల్కర్ కుమారుడైన ఆనందరావును దత్తత తీసుకున్నారు. దామోదర్ గంగాధర్ రావు అని పేరు పెట్టారు. అయితే  21 నవంబర్ 1853 న, రాజా గంగాధర్ రావు మరణించాడు. భర్త మరణంతో రాణి లక్ష్మీబాయి తీవ్ర దుఃఖానికి గురైంది.

అదను చూసుకుని యుద్ధం ప్రకటించిన బ్రిటిష్ ప్రభుత్వం:  రాజా గంగాధరరావు మరణవార్త బ్రిటిష్ వారికి తెలియగానే.. వారు రాణి దత్తపుత్రుడు బాలక్ దామోదర్ రావును ఝాన్సీ వారసుడిగా అంగీకరించడానికి నిరాకరించారు. రాజ్య స్వాధీన విధానంలో భాగంగా ఝాన్సీని బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. లక్ష్మీబాయి ఇదే విషయంపై జాన్ లాంగ్ అనే బ్రిటీష్ న్యాయవాదిని కలుసుకుని లండన్ కోర్టులో దావా వేసింది. ఆ దావాను కోర్టు కొట్టివేసింది. దీంతో లక్ష్మీబాయి బ్రిటిష్ పాలకుల నుంచి ఝాన్సీని రక్షించుకునేందుకు నడుం బిగించింది.  స్వచ్ఛంద సేవకుల సైన్యాన్ని ఏర్పాటు  చేసుకుని బ్రిటిష్ వారిపై యుద్ధం ప్రకటించింది.

బ్రిటిష్ సైనికులు ఝాన్సీపై దాడి   ఝాన్సీ 1857 విప్లవానికి ప్రధాన కేంద్రంగా మారింది. బ్రిటిష్ వారు లక్ష్మీబాయి పేరు వింటే చాలు వణికిపోయేవారు. అంతేకాదు రాణి లక్ష్మీబాయి కూడా బ్రిటిష్ వారి పేరు చెబితే చాలు ఆగ్రహం వ్యక్తం చేసేవారు. దీంతో బ్రిటిష్ అధికారులు ఝాన్సీ రాణి పై తీవ్ర కోపంతో ఉన్నారు. అకస్మాత్తుగా 1858లో బ్రిటిష్ వారు ఝాన్సీపై దాడి చేశారు. రాణిని మోసం చేసి  బ్రిటిష్ వారు కోటలోకి ప్రవేశించారు. దామోదర్‌ని వీపుపై  కట్టుకుని.. ఒక్క చేతిలో కత్తి పట్టుకుని బ్రిటీష్ సైన్యంతో యుద్ధం చేయడం ప్రారంభించింది. బ్రిటీష్ సైన్యం పెరుగుతూనే ఉంది.. ప్రజల సలహాతో..  రాణి కల్పి కోట వైపు చేరుకుంది.

రాణి లక్ష్మీబాయి కల్పి కోటకు చేరుకున్న అనంతరం..  నానా సాహెబ్, అతని జనరల్ తాత్యా తోపే ఇతర సన్నిహితులతో సమావేశమై బ్రిటీష్ వారిని ఓడించడానికి ఒక వ్యూహాన్ని రూపొందించింది. అయితే అప్పుడు యుద్ధానికి ఇతర రాజులను పిలిచినా మద్దతు తగిన విధంగా లభించలేదు.  బ్రిటీష్ జనరల్ హ్యూ రోజ్.. రాణి లక్ష్మీబాయి ఉన్న కల్పికి చేరుకున్నాడు. 7 మే 1858న, కొంచ్ ప్రాంతంలో భీకర యుద్ధం జరిగింది. అయితే బ్రిటిష్ వారు విజయం సాధించి కోటను చేరుకున్నారు. మే 22న, హ్యూ రోజ్ 20 గంటలపాటు నిరంతరంగా మందుగుండు పేల్చి చివరకు కోటలోకి ప్రవేశించాడు. రాణి లక్ష్మీబాయిని చనిపోయినా లేదా సజీవంగా పట్టుకోవాలనేది బ్రిటిష్ అధికారి ప్రణాళిక. అయితే అప్పటికే లక్ష్మీబాయి, నానా సాహెబ్, తాత్యా తోపే కోట రహస్య మార్గం ద్వారా కోటను విడిచి పెట్టారు.

రాణిని ‘మనిషి’గా భావించిన హ్యూ రోజ్ కల్పి కోటను విడిచిపెట్టిన తరువాత..  రాణి లక్ష్మీబాయి సంయుక్త దళాలు, నానా సాహెబ్ గ్వాలియర్‌లోని ఒక కోటను స్వాధీనం చేసుకున్నారు.  బ్రిటిష్ వారితో మూడవ సారి యుద్ధానికి సన్నాహాలు ప్రారంభించారు. బ్రిటీష్ అధికారి హ్యూ రోస్ మరింత కోపంతో గ్వాలియర్ చేరుకున్నాడు. 18 జూన్ 1858న గ్వాలియర్ సమీపంలోని సరాయ్‌లో బ్రిటీష్ సైన్యంతో పోరాడుతూ యుద్ధంలోనే రాణి లక్ష్మీబాయి  వీరమరణం పొందింది. అనంతరం బ్రిటిష్ జనరల్ హ్యూ రోస్  రాణి లక్ష్మీబాయి గురించి మాట్లాడుతూ.. లక్ష్మీబాయి  అందం, చాకచక్యం, పట్టుదలతో ప్రసిద్ది చెందింది. తిరుగుబాటు నాయకుల్లో గొప్ప వీరనారి.. నేటికీ చరిత్రలో నిలిచిన ధీరురాలు

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu