Viral: కిడ్నీ సమస్యతో ఆస్పత్రికెళ్లిన రైతు.. స్కాన్ చేసిన డాక్టర్లకు ఫ్యూజులౌట్!
ఆ రైతును కిడ్నీ సమస్య గత కొద్దినెలలుగా వేధిస్తోంది. చాలా చోట్ల చికిత్స తీసుకున్నాడు. వైద్యులు సూచించిన మందులను వాడాడు.
ఆ రైతును కిడ్నీ సమస్య గత కొద్దినెలలుగా వేధిస్తోంది. చాలా చోట్ల చికిత్స తీసుకున్నాడు. వైద్యులు సూచించిన మందులను వాడాడు. అయినా కూడా ప్రయోజనం లేకపోయింది. ఇక చేసేదేమీలేక చివరకు పెద్దాసుపత్రికి వెళ్లాడు. అక్కడ డాక్టర్లు అతడికి పలు టెస్టులు చేశారు. అనంతరం వచ్చిన రిపోర్ట్స్ చూసి దెబ్బకు వారి ఫ్యూజులు ఎగిరిపోయాయి.
వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని నందూర్‌బార్ జిల్లా పటోలి నివాసి అయిన 50 ఏళ్ల రామన్ చౌరే అనే రైతు గత కొద్ది నెలలుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. కిడ్నీలో రాళ్లు ఉండటం వల్ల విపరీతంగా నొప్పి వచ్చేది. దీనికి అతడు చాలా చోట్ల చికిత్స తీసుకున్నాడు. అయినా ఎలాంటి ఉపయోగం లేకపోయింది. సమస్య కాస్తా పెద్దవుతూ వచ్చింది. ఇక చేసేదేమిలేక పెద్దాసుపత్రికి వెళ్లాడు. అక్కడున్న డాక్టర్లు రామన్‌కు టెస్టులు నిర్వహించి.. అనంతరం రిపోర్ట్స్ చూసి దెబ్బకు ఖంగుతిన్నారు. సుమారు గంట పాటు శస్త్రచికిత్స నిర్వహించి రైతుకు కొత్త జీవితాన్ని ఇచ్చారు. ఆపరేషన్‌ను పర్యవేక్షించిన డాక్టర్ ఆశిష్ పటేల్ మాట్లాడుతూ.. ‘రామన్ కిడ్నీ నుంచి కిలో బరువున్న రాయిని తొలగించాం. ప్రపంచంలోనే అతిపెద్ద కిడ్నీ సర్జరీగా దీన్ని భావించవచ్చు. ఇది త్వరలోనే ఇండియా బుక్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదు కావొచ్చు’ అని పేర్కొన్నారు.