Karnataka: ప్రేతాత్మలకి అట్టహాసంగా పెళ్లిళ్లు చేసి, కట్న కానుకలు పుచ్చుకునే ఓ విచిత్ర సాంప్రదాయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇక్కడ జరిగే ఆత్మల పెళ్లిళ్లకు హాజరయ్యేది మాత్రం ఆత్మలు కాదు మనుషులే.
Karnataka: చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం. ఇది సామెత. కానీ అది ఒకనాటి మాట. కానీ నిజానికి అది సామెత కాదు. అక్షర సత్యం. ఆ సామెత ఊరికినే పుట్టలేదని రుజువు చేస్తోంది ఓ పురాతన సాంప్రదాయం. ప్రేతాత్మలకి అట్టహాసంగా పెళ్లిళ్లు చేసి, కట్న కానుకలు పుచ్చుకునే ఓ విచిత్ర సాంప్రదాయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇక్కడ జరిగే ఆత్మల పెళ్లిళ్లకు హాజరయ్యేది మాత్రం ఆత్మలు కాదు మనుషులే. ఈ వింత ప్రేతాత్మల పెళ్లిళ్ల సంప్రదాయం దక్షిణ కన్నడ జిల్లాలో కొందరు ఇప్పటికీ పాటిస్తున్నారు. ఎప్పుడో దశాబ్దాల క్రితం చచ్చిపోయిన తమ వారికి ఇప్పుడు పెళ్ళి చేసే వివాహ వేడుకల గురించి తెలియాలంటే ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీని చదవాల్సిందే.
I reached a bit late and missed the procession. Marriage function already started. First groom brings the ‘Dhare Saree’ which should be worn by the bride. They also give enough time for the bride to get dressed! pic.twitter.com/KqHuKhmqnj
ఈ వేడుకల్లో భాగంగా ముందుగా అత్తింటివారిచ్చిన పట్టు వస్త్రాలను వధూవరులు ధరించాల్సి ఉంటుంది. పెట్టిపోతలయ్యాక పెళ్లి తంతు మొదలవుతుంది. ఈ వివాహ వేడుకలో అందరి దృష్టి వధూవరులపై కాదు. కానీ నిజానికి అక్కడ వధూవరులుండరు. వారు కూర్చునే కుర్చీలపై తెల్లటి వస్త్రాలు కప్పి ఉంచుతారు. దాని చుట్టూ తిరుగుతూ వధూవరులు వేయాల్సిన ఏడడుగులను ఆ ఇంటి వాళ్లే వేసేస్తారు. తాళి, ఆశీస్సులు తదితర పెళ్లి కార్యక్రమాలు ఇక మామూలే. కేవలం కుటుంబ సభ్యులే కాదు స్థానికులు, బంధువులు, సన్నిహితులు కూడా ఈ వేడుకకు హాజరవుతారు. ఇంతకీ ఈ పెళ్లి ఎవరికనేగా మీ అనుమానం. ఎప్పుడో పురిట్లో చచ్చిపోయిన వరుడికి. అలాగే ప్రసవం సందర్భంగా పుట్టగానే చనిపోయిన అమ్మాయిని వెతికి మరీ పెళ్లి చేస్తారు. ఈ ప్రేతాత్మల పెళ్లిళ్లలో ఏడు తరాల సాంప్రదాయాల్ని చూడడం మాత్రం మరిచిపోరు. కులం, గోత్రం, వరుసలు అన్నీ సరిగ్గా కుదిరాకే పెళ్లికి రెడీ చేస్తారు. కాకపోతే అసలు మనుషులు ఉండరు. ఇప్పుడు జరుగుతోన్న ప్రేతాత్మల వయస్సు 30 ఏళ్లు. అంటే మూడు దశాబ్దాల క్రితం చనిపోయిన వారికి ఇప్పుడు పెళ్లిళ్లు చేస్తున్నారన్నమాట. ఇక వధూవరుల ప్రెసెన్స్ తప్ప విందులు, వినోదాలూ అన్నీ షరా మామూలే.
While bride getting ready groom is already waiting. Isn’t that always a thing? ? pic.twitter.com/7QvFCiI3Re
ఇందులో మరో విచిత్రమైన విషయం ఏమిటంటే పెళ్లిళ్ల ఆత్మలకైనా మనుషులకైనా ఓ ప్రహసనమే. ఎందుకంటే సంబంధం కుదుర్చుకునే ముందు వయస్సులో కొంచెం తేడావచ్చినా విషయం బెడిసికొడుతుంది. పెళ్లికూతురు ప్రేతాత్మ పెళ్లి కొడుకు ప్రేతాత్మకంటే కొంచెం పెద్దదయ్యిందని ఓ పెళ్లి పీటల దాకా వచ్చి పెటాకులైంది. ఇంతకీ విషయం ఏమిటంటే పెళ్లి కొడుకు వయస్సు కంటే పెళ్లి కూతురు వయస్సులో పెద్దదవడం వల్ల వరుడి తరపు బంధువులు ఆ పెళ్లిని తిరస్కరించారట. వధువు వరుడికన్నా ఒకటో రెండో రోజులు పెద్దది. అంటే పెళ్లికొడుకు కంటే ఒక్కరోజు ముందుగా పుట్టి చనిపోయిందన్న మాట.