Free LPG Cylinders: రేషన్ కార్డుదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్…!! రూ.55 కోట్లు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం

ప్రభుత్వ నిర్ణయం ప్రకారం అర్హులైన కుటుంబాలకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించనున్నారు. ఈ ప్రాజెక్టును..

Free LPG Cylinders: రేషన్ కార్డుదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్...!! రూ.55 కోట్లు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం
Lpg Price
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 14, 2022 | 11:41 AM

Free LPG Cylinders:  ధరల పెరుగుదలతో అల్లాడుతున్న సామాన్యులకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. అంటే ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరం రేషన్ కార్డుదారులకు ఉచితంగా ఎల్పీజీ సిలిండర్లు అందజేసి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ఊరట కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం అర్హులైన కుటుంబాలకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించనున్నారు. ఈ ప్రాజెక్టును ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ పథకం ప్రకారం, అంత్యోదయ కార్డు హోల్డర్లకు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా లభిస్తాయి. ఉచిత ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.55 కోట్లు కేటాయించింది.

కేబినెట్‌ సమావేశం అనంతరం చీఫ్‌ సెక్రటరీ సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధు ఈ ప్రాజెక్టు గురించి మీడియాకు వివరించారు. 1,84,142 అంత్యోదయ కార్డుదారులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతారు. ఉచిత ఎల్‌పిజి సిలిండర్‌తో పాటు, గత సంవత్సరాల్లో గోధుమలు కొనుగోలు చేసేటప్పుడు రైతులకు క్వింటాల్‌కు రూ.20 బోనస్‌ను కూడా కొనసాగించాలని మంత్రివర్గం నిర్ణయించిందని ఆయన వివరించారు.

అయితే, ప్రతి సంవత్సరం 3 ఎల్‌పిజి సిలిండర్లు ఉచితంగా పొందాలంటే కొన్ని షరతులు పాటించాలి.

1. లబ్ధిదారుడు ఉత్తరాఖండ్‌లో శాశ్వత నివాసి అయి ఉండటం తప్పనిసరి.

2. వ్యక్తి తప్పనిసరిగా అంత్యోదయ రేషన్ కార్డ్ హోల్డర్ అయి ఉండాలి

3. అంత్యోదయ రేషన్ కార్డ్ హోల్డర్ దానిని గ్యాస్ కనెక్షన్ కార్డుతో లింక్ చేయాలి.

ఉత్తరాఖండ్ ప్రభుత్వ ఈ పథకం కింద ప్రతి సంవత్సరం ఉచిత LPG సిలిండర్‌లను ఎలా పొందాలి?

ఉత్తరాఖండ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాన్ని మీరు పొందాలనుకుంటే ఈ నెలలో అంటే జూలైలోనే మీ అంత్యోదయ కార్డ్‌ని LPG కనెక్షన్ కార్డ్‌తో లింక్ చేయండి. మీరు ఈ రెండింటిని అనుసంధానించకుంటే మీరు ఈ ప్రభుత్వ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని కోల్పోతారు.

ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇప్పటికే అన్ని లాంఛనాలను పూర్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల వారీగా అంత్యోదయ రేషన్ కార్డుదారుల జాబితాను సిద్ధం చేసి స్థానిక గ్యాస్ ఏజెన్సీలకు పంపింది. కాబట్టి అంత్యోదయ కార్డు హోల్డర్లు వీలైనంత త్వరగా తమ గ్యాస్ కనెక్షన్‌కి కనెక్ట్ చేసుకోవాలి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు