నిర్భందం నుంచి విడుదలైన అయిదుగురు కశ్మీరీ నేతలు
జమ్ముకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిగా ఉన్న ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత.. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే పరిస్థితులను చక్కదిద్దేదుంకు.. అక్కడి రాజకీయ నేతల్ని ప్రభుత్వం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే విడతల వారీగా వారిని రిలీజ్ చేస్తోంది. తాజాగా సోమవారం అయిదుగురు నేతల్ని రిలీజ్ చేసింది ప్రభుత్వం. వీరిలో ఇద్దరు నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి చెందిన వారు కాగా.. మరో ముగ్గురు పీడీపీకి చెందిన వారు. ఇష్ఫాక్ జబ్బార్, గులాబ్ నబీ […]
జమ్ముకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిగా ఉన్న ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత.. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే పరిస్థితులను చక్కదిద్దేదుంకు.. అక్కడి రాజకీయ నేతల్ని ప్రభుత్వం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే విడతల వారీగా వారిని రిలీజ్ చేస్తోంది. తాజాగా సోమవారం అయిదుగురు నేతల్ని రిలీజ్ చేసింది ప్రభుత్వం. వీరిలో ఇద్దరు నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి చెందిన వారు కాగా.. మరో ముగ్గురు పీడీపీకి చెందిన వారు. ఇష్ఫాక్ జబ్బార్, గులాబ్ నబీ భట్ నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన వారు కాగా.. బాషిర్ మిర్, జాహుర్ మిర్, యాసిర్ రేషిలు పీడీపికి చెందిన వారు. గత ఆగస్టు నుంచి వీరిని ప్రభుత్వం నిర్భందంలోనే ఉంచింది. గత నెల నవంబర్ 25వ తేదీన దిలావర్ మీర్, గులామ్ హసన్ మీర్‌లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా, అతని కుమారుడు ఒమర్ అబ్ధుల్లా, పీపుల్ డెమోక్రటిక్ పార్టీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ఇంకా నిర్భందంలో కొనసాగుతున్నారు. అయితే వీరిని ఇంకా ఎప్పుడు విడుదల చేస్తారన్న దానిపై స్పష్టత లేదు.