AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Accident: వేగంగా దూసుకొచ్చిన మృత్యువు.. ఐదుగురు మృతి.. భయానకంగా మారిన స్పాట్..

రాజస్తాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హనుమాన్‌ఘర్ జిల్లాలో అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. కారు, ట్రక్కు ఢీ కొనడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం....

Accident: వేగంగా దూసుకొచ్చిన మృత్యువు.. ఐదుగురు మృతి.. భయానకంగా మారిన స్పాట్..
Accident
Ganesh Mudavath
|

Updated on: Jan 01, 2023 | 10:41 AM

Share

రాజస్తాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హనుమాన్‌ఘర్ జిల్లాలో అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. కారు, ట్రక్కు ఢీ కొనడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పల్లు పోలీస్ స్టేషన్ పరిధిలోని మెగా హైవేపై బిస్రాసర్ గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. చికిత్స అందించేందుకు క్షతగాత్రులను పల్లు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసంబికనీర్‌కు తీసుకెళ్లారు. ప్రమాదం తర్వాత ట్రక్కు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఇటుకల లోడ్ తో వెళ్తున్న ట్రక్కు.. పల్లు నుంచి సర్దార్ నగరం వైపు వెళ్తోంది. అదే సమయంలో కారును ఢీ కొట్టిందని పల్లు పోలీస్ స్టేషన్ అధికారి గోపిరామ్ తెలిపారు.

ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని ఆస్పత్రికి తరలించగా అక్కడ మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు వైద్యులు అధికారికంగా ధ్రువీకరించారు. ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని, ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు. పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. అనంతరం మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. క్షతగాత్రుల హాహాకారాలు, బంధువుల రోదనలతో ప్రమాద స్థలం భయానకంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం

Follow Us
హైదరాబాద్‌లో తొలిసారిగా డబుల్ డెక్కర్ కారిడార్.. ఎక్కడంటే..?
హైదరాబాద్‌లో తొలిసారిగా డబుల్ డెక్కర్ కారిడార్.. ఎక్కడంటే..?
ఉన్నట్లుండి భారీగా పడిపోయిన బంగారం ధరలు.. ఇప్పుడు ఎంతంటే..?
ఉన్నట్లుండి భారీగా పడిపోయిన బంగారం ధరలు.. ఇప్పుడు ఎంతంటే..?
రెడ్‌ డ్రెస్‌లో అదిరిపోయిన బెబో లుక్
రెడ్‌ డ్రెస్‌లో అదిరిపోయిన బెబో లుక్
ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న ఏఎస్ఐ లీలలు.. అప్పట్లోనే..
ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న ఏఎస్ఐ లీలలు.. అప్పట్లోనే..
పాండ్యా బ్రదర్స్ మధ్య ముదిరిన విబేధాలు? .. సాక్ష్యం ఇదే
పాండ్యా బ్రదర్స్ మధ్య ముదిరిన విబేధాలు? .. సాక్ష్యం ఇదే
ఉదయాన్నే టిఫిన్ బదులు ఇది తిని చూడండి.. దెబ్బకు బాడీ కూల్‌
ఉదయాన్నే టిఫిన్ బదులు ఇది తిని చూడండి.. దెబ్బకు బాడీ కూల్‌
ఊరికి కొత్త.. రెస్టారెంట్‌ అనుకుని చావు ఇంటికి వెళ్లిన పర్యాటకులు
ఊరికి కొత్త.. రెస్టారెంట్‌ అనుకుని చావు ఇంటికి వెళ్లిన పర్యాటకులు
వామ్మో.. కండలు తిరిగిన బాడీతో గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్.
వామ్మో.. కండలు తిరిగిన బాడీతో గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్.
ఆర్‌సీబీ స్టార్ ప్లేయర్ టిమ్ డేవిడ్‌కు షాక్
ఆర్‌సీబీ స్టార్ ప్లేయర్ టిమ్ డేవిడ్‌కు షాక్
ఎండాకాలంలో తులసి మొక్క గుబురుగా పెరగాలంటే ఇలా చేయండి చాలు..
ఎండాకాలంలో తులసి మొక్క గుబురుగా పెరగాలంటే ఇలా చేయండి చాలు..