AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending: పోలీస్ ఇంట్లో చోరీ.. దొంగలను పట్టుకోవాలని బాబాను ఆశ్రయిస్తే.. ఊహించని ట్విస్ట్..

దొంగతనాలు లేదా దోపిడీలు జరిగినప్పుడు సాధారణంగా పోలీసులను ఆశ్రయిస్తుంటాం. బాధ్యులను పట్టుకుని బాధితులకు న్యాయం చేయాలని కోరుకుంటుంటారు. కానీ ఆ పోలీసుల ఇంట్లోనే చోరీ జరిగితే... వాళ్లెవరిని ఆశ్రయించాలి.....

Trending: పోలీస్ ఇంట్లో చోరీ.. దొంగలను పట్టుకోవాలని బాబాను ఆశ్రయిస్తే.. ఊహించని ట్విస్ట్..
Theft
Ganesh Mudavath
|

Updated on: Jan 01, 2023 | 11:51 AM

Share

దొంగతనాలు లేదా దోపిడీలు జరిగినప్పుడు సాధారణంగా పోలీసులను ఆశ్రయిస్తుంటాం. బాధ్యులను పట్టుకుని బాధితులకు న్యాయం చేయాలని కోరుకుంటుంటారు. కానీ ఆ పోలీసుల ఇంట్లోనే చోరీ జరిగితే… వాళ్లెవరిని ఆశ్రయించాలి.. వీళ్లకీ రక్షకులు ఉన్నారండోయ్‌.. వారే బాబాలు. ఆగండాగండి.. కోప్పడకండి.. బాబాలు ఏంటి.. పోలీసులను కాపాడడమేంటని ఆలోచిస్తున్నారా..అయితే ఈ స్టోరీ చదివేయండి.. మనదేశంలో బాబాలకు కొదవేముంది చెప్పండి. తాజాగా ఓ పోలీసు అధికారి తన ఇంట్లో చోరీ జరిగితే దొంగలను పట్టుకుని చీల్చి చెండాల్సిన ఆయన వారిని పట్టుకునేందుకు సాయం చేయాలంటూ ఓ బాబాను ఆశ్రయించారు. బాబా కాళ్ల వద్ద కూర్చుని మాట్లాడుతున్న పోలీసు అధికారి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ ఘటన హర్యానాలోని పానిపట్‌ జిల్లాలో జరిగింది. డిసెంబరు 23 న జరిగిన ఈ ఘటనలో చాందినీ బాగ్ పోలీస్ క్వార్టర్స్‌లోని ఏఎస్సై కృష్ణకుమార్ ఇంట్లో దొంగలు పడ్డారు. 40 తులాల బంగారం, మూడున్నర లక్షల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. దాంతో ఈ ఏఎస్‌ఐ తాను పనిచేస్తున్న పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. దొంగల ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోయింది. లాభం లేదనుకున్న ఆయన దొంగలను పట్టుకునేందుకు సాయం చేయాలంటూ పండోఖర్ బాబా ఆశ్రమానికి వెళ్లారు.

తన ఇంట్లో జరిగిన చోరీ గురించి ఆయనకు వివరించి, దొంగలను పట్టుకోవడంలో సాయం చేయాలని కోరారు. వెంటనే స్పందించిన బాబా.. ఆయన ఈ పోలీసు అధికారికి మంచి క్లూ అయితే ఇచ్చారు కానీ… గ్యారంటీ మాత్రం ఇవ్వలేదు. ఇంతకీ బాబా ఏం చెప్పారంటే.. క్లూ మీ పోలీస్ క్వార్టర్స్‌లోనే ఉందీ.. పంజాబ్ సరిహద్దులకు వెళ్తే దొంగలు దొరుకుతారని చెప్పి, చివరిలో గ్యారెంటీ లేదని చెప్పడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం

Follow Us
భర్త, పిల్లలు లేని మహిళ ఆస్తి ఎవరికి చెందుతుంది?
భర్త, పిల్లలు లేని మహిళ ఆస్తి ఎవరికి చెందుతుంది?
పెళ్లైందని చెప్పడంతో ఆఫర్ మిస్ అయ్యింది.. కట్ చేస్తే.. ఇప్పుడు ..
పెళ్లైందని చెప్పడంతో ఆఫర్ మిస్ అయ్యింది.. కట్ చేస్తే.. ఇప్పుడు ..
రికార్డు సృష్టించిన నిమ్స్.. 2 వేల కిడ్నీ మార్పిడులతో సంచలనం!
రికార్డు సృష్టించిన నిమ్స్.. 2 వేల కిడ్నీ మార్పిడులతో సంచలనం!
చెలరేగిన హైదరాబాద్ బ్యాటర్స్.. బెంగుళూరు ముందు భారీ టార్గెట్
చెలరేగిన హైదరాబాద్ బ్యాటర్స్.. బెంగుళూరు ముందు భారీ టార్గెట్
మండుతున్న ఎండలు.. ఏపీలో కూల్ డ్రింక్ కాదు, బీర్‌కే భారీ క్రేజ్!
మండుతున్న ఎండలు.. ఏపీలో కూల్ డ్రింక్ కాదు, బీర్‌కే భారీ క్రేజ్!
అతడు నా కలను మోసం చేశాడు.. నాకు వెన్నుపోటు పొడిచాడు..
అతడు నా కలను మోసం చేశాడు.. నాకు వెన్నుపోటు పొడిచాడు..
రూ.81,590 కోట్లతో బ్యాంకింగ్‌ సిస్టమ్‌కు బూస్టర్‌ డోస్‌!
రూ.81,590 కోట్లతో బ్యాంకింగ్‌ సిస్టమ్‌కు బూస్టర్‌ డోస్‌!
హైదరాబాద్‌‌లో టెస్లా..! మంత్రి శ్రీధర్ బాబుతో కీలక భేటీ..
హైదరాబాద్‌‌లో టెస్లా..! మంత్రి శ్రీధర్ బాబుతో కీలక భేటీ..
శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పాల పొంగళ్ళు..
శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పాల పొంగళ్ళు..
బల్లి కనిపిస్తే డబ్బు వర్షమా.. లేక దురదృష్టానికి సంకేతమా..?
బల్లి కనిపిస్తే డబ్బు వర్షమా.. లేక దురదృష్టానికి సంకేతమా..?